Home » Mem Famous Review in Telugu : ‘మేమ్ ఫేమస్’ రివ్యూ.. హిట్ అయ్యేనా ?

Mem Famous Review in Telugu : ‘మేమ్ ఫేమస్’ రివ్యూ.. హిట్ అయ్యేనా ?

by Anji
Ad

యూట్యూబ్ సిరీస్, మ్యూజిక్ వీడియో సాంగ్ లతో ఫేమస్ అయిన యువకుడు సుమంత్ ప్రభాస్. అతను కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘మేమ్ ఫేమస్’. మేజర్, రైటర్ పద్మభూషణ్ తరువాత ఛాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలు నిర్మించిన సినిమా ఇది. లహరి ఫిలింస్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందే పలువురు ప్రముఖులు ప్రమోట్ చేశారు. ఈ సినిమాని ప్రచారంతో హోరెత్తించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 

నటీనటులు : సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య లక్ష్మణ్, సిరి రాసి, నరేంద్ర రవి, కిరణ్ ముచ్ఛ, మురళీధర్ గౌడ్, అంజిమామ, శివ నందన్ తదితరులు.

సంగీతం : కళ్యాణ్ నాయక్

నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుమంత్ ప్రభాస్

విడుదల తేదీ : మే 26, 2023

కథ : 

మయి అలియాస్ మహేష్ (సుమంత్ ప్రభాస్), దుర్గ ( మణి ఏగుర్ల), బాలి అలియాస్ బాలకృష్ణ (మౌర్య చౌదర్య) స్నేహితులు. ఈ ముగ్గురూ అవారాగా తిరుగుతుంటారు. వాళ్లు చేసే పనులకు ఊర్లో జనాలు ఇబ్బంది పడుతుంటారు. పంచాయతీ ప్రెసిడెంట్ జింక వేణు(కిరణ్ మచ్చ), అంజి మామ మాత్రం మద్దతు ఇస్తారు. ఊరి జనాల చేత తూ అనిపించుకున్న మయి ఎలా ఫేమస్ అయ్యాడు..? మామ కూతురు మౌనిక (సార్య లక్ష్మణ్)తో అతని ప్రేమ కథ ఏంటి . అది ఏ తీరానికి చేరింది. మధ్యలో ఫేమస్ టెంట్ హౌస్, ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్ కహానీ ఏంటి ? హీరో అండ్ ఫ్రెండ్స్ చేసిన పనుల వల్ల ఊరి సమస్యలు ఎలా తీరాయి అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

Advertisement

విశ్లేషణ : 

సాధారణంగా పేపర్ మీద రాసిన సన్నివేశాన్ని స్క్రీన్ మీదకు తీసుకురావడం అంత సులభమేమి కాదు. ముఖ్యంగా కామెడీని 100 పర్సెంట్ స్క్రీన్ మీదికి వస్తే.. ఆ సినిమాకు బాక్సాఫీస్ బరిలో అడ్డు ఉండదు.మేమ్ ఫేమస్ లో యూత్ ఫుల్ కామెడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లిప్ స్టిక్ స్పాయిలర్ క్యారెక్టర్ సీన్స్ కామన్ ఆడియన్ రిలేట్ చేసుకునే సీన్స్ కొన్ని ఉన్నాయి. ఫ్రెండ్స్ మధ్యలో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. బావపై మరదలు ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశంలో గాఢత యువతి యువకులను ఆకట్టుకుంటుంది. కథలో డెప్త్ మిస్ అయింది. రైతే రాజు వంటి డైలాగ్ లు చెప్పించడం కథా గమనంలో అతకలేదు. దుర్గతో తండ్రి రెండు ఎకరాల భూమి సంపాదించిన విషయం చెప్పడం వంటివి స్పేస్ తీసుకొని మరీ ఏదో సందేశం ఇవ్వడానికి బలవంతంగా భావోద్వేగాలను కథలో ఇరికించడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తుంది. కథలో కామెడీనీ, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడిగా సుమంత్ ప్రభాస్ తడబడ్డాడు. కథలో కొత్తదనం లేదు. తెలంగాణ నేపథ్యంలో సీసా తీసుకొని పాత సరుకుతో నింపేశారు. విశ్రాంతి, శుభం కార్డు కోసం ఎదురు చూసేవిధంగా ఈ సినిమాను సాగదీశారు. కళ్యాణ్ నాయక్ మంచి సంగీతాన్ని అందించారు.

 ప్లస్ పాయింట్లు:

కామెడీ సీన్లు

సంగీతం

ఎమోషన్ సీన్స్

లవ్ సీన్

మైనస్ పాయింట్లు:

సాగదీత

దర్శకత్వం

రేటింగ్ : 2/5

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 రెబల్ స్టార్ కి మహిళా లోకం బ్రహ్మరథం పట్టిన సినిమా ఏదో తెలుసా ?

తల్లిదండ్రులు చేసిన ఆ పొరపాటు వల్లనే ఆర్.నారాయణ మూర్తి పెళ్లి చేసుకోలేదా ?

Visitors Are Also Reading