Home » మహేష్ బాబుతో సినిమా చేస్తా అంటున్న మెహర్ రమేష్..!

మహేష్ బాబుతో సినిమా చేస్తా అంటున్న మెహర్ రమేష్..!

by Azhar
Ad

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనేది చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు మహేష్ బాబు.. సర్కారు వారి పాట అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఇది ఫ్యాన్స్ ను సంతృప్తి పరచలేదు. అయితే ఈ సినిమా తర్వాత లెక్క ప్రకారం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయాలి.

Advertisement

కానీ ఈ సినిమా అనేది ఆలస్యం కానుండటంతో మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తాడు. కానీ నేను మహేష్ బాబుతో సినిమా చేస్తాను అని డైరెక్టర్ మెహర్ రమేష్ తాజాగా చేసిన కామెంట్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. అయితే మెహర్ రమేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని ఎం అయ్యాయో అందరికి తెలుసు.

Advertisement

అయిన ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో బోళా శంకర సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నేను కొత్త గ్యాప్ తీసుకోని మహేష్ బాబుతో సినిమా గురించి మాట్లాడుతాను. ఆయనకు కథ సిద్ధం చేసి సినిమా చేస్తా అని మెహర్ రమేష్ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు చేస్తున్న బోళా శంకర సినిమా అనేది పూర్తి అయ్యేవరకు నేను దాని గురించి ఆలోచించాను.. పూర్తి ఫోకస్ అనేది చిరు సినిమా పైనే ఉంచుతా అని మెహర్ రమేష్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

భారత విజయాల వెనుక రహస్యం ఇదే..!

రోహిత్ కు గాయం.. సెమీస్ ఆడుతాడా.. లేదా..?

Visitors Are Also Reading