Telugu News » ఆ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి కాళ్ళు మొక్కిన రామ్ చరణ్…ఎందుకో తెలుసా …!

ఆ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి కాళ్ళు మొక్కిన రామ్ చరణ్…ఎందుకో తెలుసా …!

by AJAY MADDIBOINA
Published: Last Updated on

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనకు కూడా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రశంసలు అనుకున్నారు. ఇక మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు జరిగిన సంగతి తెలిసిందే. చరణ్ బర్త్ దే సందర్భంగా ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు పలువురు దర్శకులు సినిమా ప్రముఖులు హాజరయ్యారు.

Ads

కాగా ఫంక్షన్ లో దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వివి వినాయక్ మెగాస్టార్ తో ఖైదీ నంబర్ 150 సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడం తో రామ్ చరణ్ ఆయనను ఇంటికి పిలిచినట్టు తెలిపారు. అంతే కాకుండా కృతజ్ఞతలు చెప్పి కాళ్ళకు నమస్కారం చేశారని అన్నారు. రామ్ చరణ్ కు అంతటి గొప్ప సంస్కారం ఉందని మెహర్ రమేష్ తెలిపారు.


You may also like