Home » సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్‌.. ఫోటో షేర్

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్‌.. ఫోటో షేర్

by Anji
Ad

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య‌, గాడ్‌ఫాద‌ర్‌, బోళాశంక‌ర్ సినిమాలు చేస్తూ పుల్ బిజీగా ఉన్నారు. షూటింగ్ నుంచి ఏమాత్రం విరామం దొరికినా ఆయ‌న మ‌రొక ప‌నిలో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఆచార్య ప్ర‌మోష‌న్స్‌తో పాటు మోహ‌న్‌రాజా, మెహ‌ర్ ర‌మేష్, బాబీ చిత్రాల షూట్‌లో ఉన్న చిరంజీవి తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో క‌లిసి వ‌ర్క్ చేశారు.

Advertisement

Advertisement

అయితే వీరిద్ద‌రూ క‌లిసి ప‌ని చేసింది మాత్రం సినిమా కోసం కాద‌ట‌. ఓ యాడ్ షూట్ కోస‌మ‌ట‌. ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ ప్ర‌క‌ట‌న కోసం చిరంజీవి రంగంలోకి దిగ‌గా.. సుకుమార్ ఆ యాడ్‌ను రూపొందించారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ తాజాగా చిరు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. సుకుమార్ టాలెంట్‌ని మెచ్చుకున్నారు. ద‌ర్శకునిగా సుకుమార్ ప్ర‌తిభ అంద‌రికీ తెలిసిందే. ఓ యాడ్ ఫిల్మ్ కోసం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో నేను న‌టించాను. షూట్‌ను ఎంత‌గానో ఎంజాయ్ చేశాను అని చిరు చెప్పారు.

Also Read :  RRR MOVIE : రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరి రెమ్యునరేషన్ ఎంత…ఇద్దరిలో ఎవరెక్కువ‌ తీసుకున్నారు..?

Visitors Are Also Reading