ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరో ఎవరు అంటే చాలామంది చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ప్రపంచంలోకి మాములు నటునిగా వచ్చిన చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా మారడంలో ఆయనకు ఎన్నో సినిమాలు సహాయపడ్డాయి. అయితే ఇప్పటికే 150కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన చిరంజీవి ఖాతాలో ఓ అరుదైన రికార్డు ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం
చిరంజీవి 1987 నుండి 1992 వరకూ వరుసగా 6 ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. మొదటగా 1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడి ప్రాణం అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత 1988లో రవిరాజాపినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన యముడికి మొగుడు సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. యమలోకం కథతో వచ్చిన ఈ సినిమాకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన అత్తకి యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమా బంపర్ హిట్ కొట్టింది. అయితే ఈ మూడు సినిమాల్లోనూ విజయశాంతి చిరుకి జంటగా నటించడం గమనార్హం
Advertisement
Advertisement
ఇక ఆ తర్వాత 1990లో అశ్వనీదత్ నిర్మాతగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి అనే సినిమా ఎంత భారీ విజయాన్ని అందుకుంది అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో అందాల తార శ్రీదేవి మెగాస్టార్ కు జంటగా నటించింది. ఆ తర్వాత 1991వ సంవత్సరంలో విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా యూత్ ను కట్టిపడేసింది. ఇందులో చిరంజీవి డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్. అలాగే ఆ తర్వాత ఏడాది 1992లో చిరంజీవితో యాక్షన్ కామెడీగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా ఘరానా మొగుడు. నగ్మా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా మెప్పించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇవి కూడా చదవండి :
ఢిల్లీకి షాక్.. కరోనా కారణంగా పాంటింగ్ జట్టుకు దూరం..!
సాహా చెప్పిందే నిజం.. మజుందార్ పై నిషేధం…!