మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఆయన మెగాస్టార్ కావడానికి ఎలా కష్టపడ్డారో తెలిసిందే. ఈ వయసులో కూడా ఎంతో ఫిట్‌గా ఉంటూ వరుస ప్రాజెక్ట్‌లను చేస్తూ కుర్ర హీరోలకు సైతం సవాలు విసురుతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే విడుదలై తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
Advertisement
అయినప్పటికీ ఆయన చేస్తున్న సినిమాల పై క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కనుంది. అదేవిదంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా కూడా చేస్తున్నాడు చిరంజీవి. అదేవిధంగా ఈయన లైనప్ లో మరో ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. అందులో బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్నది. మెగాస్టార్ 154 వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం.
Advertisement
ఇదిలా ఉండగా.. ఈ సినిమా సెట్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ సందడి చేసారు. ఈయన సెట్ లోకి వచ్చిన విషయాన్ని టీమ్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షూట్ లో శృతి హాసన్ తో పాటు చిరంజీవి, వెన్నెల కిషోర్ పాల్గొంటున్నారు. ఈ తరుణంలోనే సుకుమార్ చిరంజీవి మెగా 154 సెట్ లో అడుగు పెట్టారు. ఈయనకు బాబీ లాప్ టాప్ లో ఏదో చూస్తుండగా ఈయన శ్రద్ధగా చూస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read :
బండ్ల గణేష్ ట్వీట్ వైరల్.. పవన్ మోసం చేశాడా అంటూ ట్వీట్ పై కామెంట్స్..!