Home » మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా తాజాగా వాల్తేరు వీరయ్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ భోళా  శంకర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి సరసన  మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చిరు చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు గత ఏడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

Advertisement

ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్ దశలోనే ఉన్నది. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ పార్ట్ నర్ అప్పుడే ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్  భోళా శంకర్  చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనుంది.దీనికి సంబంధించి ఓటిటి ప్లాట్ ఫామ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాలో తమ ఓటీటీ లోనే విడుదల కాబోతున్నాయని ప్రకటించిన నెట్ ఫ్లిక్స్.. మెగాస్టార్ భోళా  శంకర్, నాని దసరా పోస్టర్ లను  షేర్ చేసింది. ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల తర్వాత తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మెగాస్టార్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.  ఏప్రిల్ 14న విడుదలయ్యే భోళా శంకర్ సినిమా ఫలితం ఏవిధంగా ఉంటుందో అప్పటివరకు వేచి చూడాలి.  

Also Read :  మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ వీళ్లే..!

అకస్మాత్తుగా ఈ పోస్టర్ను చూసిన చాలా మంది బోలా శంకర్ సినిమా డైరెక్టర్ ఓటీపీ లో వస్తుందేమోనని ఆశ్చర్యపోయారు. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యారు. తమిళ హీరో అజిత్ నటించిన హాలీవుడ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా బోలాశంకర్ తెరకెక్కనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధంతోపాటు మాసంశాలను మేళవిస్తూ ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ రూపొందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర విచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మనిషర్మ కుమారుడు మహతి స్వర సాగర్ స్వరాలను సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 14న విడుదల అయ్యే బోలా శంకర్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి మరి. 

Also Read :  విడుదలకు ముందే నాని ‘దసరా’ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్.. ఎందులో అంటే..?

Visitors Are Also Reading