మెగా హీరోలా మజాకా అన్నట్లు ఉంది తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళ జోరు. తండ్రి, కొడుకు, మేనల్లుడు, బాబాయి, ఇలా ఒకరికొకరు పోటీలు పడుతూ తెగ రెచ్చిపోతున్నారు. ఇక ఎవరిస్టైల్లో వారు సినిమాలు తీసుకుంటూ మెగా ఫ్యామిలీ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు ఏంటి వాటి సంగతులేంటో తెలుసుకుందాం…
వరుణ్ తేజ్ :
Advertisement
మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గని. ఈ చిత్రం ఈమధ్యనే గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి హిట్ ను అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు “గని” అనే ఒక స్పోర్ట్స్ డ్రామా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
అల్లుఅర్జున్ :
స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను చేసింది. క్రిస్మస్ సందర్భంగా సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సుకుమార్ దర్శకత్వంలో సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిరంజీవి:
Advertisement
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న కమర్షియల్ చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 4 2022న ఆచార్య చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
రామ్ చరణ్:
రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం). ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్నఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. జనవరి 7న త్రిపుల్ ఆర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
పవన్ కళ్యాణ్:
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజైన టైటిల్సాంగ్ రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం సంక్రాంతి బరినుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24, లేదా 25న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ బరిలో చివరికి ఓడెదెవరు బాక్సాఫీస్ ముందు నిలిచేదెవరనేది సినిమాలు విడుదలయితేగాని చెప్పలేం. ఏది ఏమైనా మొత్తానికి ఈ మూడు, నాలుగు నెలలు మెగా హీరోలు థియేటర్లన్నీ బ్లాక్ చేస్తున్నారు అన్న మాట.