Home » శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ష‌న్‌లో మెగా స్టార్, ఐకాన్ స్టార్ మ‌ల్టి స్టార‌ర్?

శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ష‌న్‌లో మెగా స్టార్, ఐకాన్ స్టార్ మ‌ల్టి స్టార‌ర్?

by Bunty
Ad

మెగా స్టార్ చిరంజీవి హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేయ‌నున్నార‌నే వార్త‌లు గ‌త కొద్ది రోజుల నుంచి ఎక్క‌వగా వినిపిస్తున్నాయి. శ్రీ‌కాంత్ అడ్డాల ఒక క‌థ ను కూడా మెగా స్టార్ చిరంజీవికి వినిపించార‌ని కూడా తెలుస్తుంది. అయితే ఈ క‌థ లో మెగా స్టార్ చిరంజీవి పాత్ర‌తో పాటు మ‌రొక కీల‌క పాత్ర ఉండ‌టంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జును మ‌రో హీరోగా తీసుకుని మ‌ల్టీ స్టార‌ర్ గా సినిమా తీయాల‌ని శ్రీ కాంత్ అడ్డాల భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే దీని పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికార‌క ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే ఈ వార్త సోష‌ల్ మీడియాలో ఫీల్మ్ ఇండ‌స్ట్రీ లో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.

Advertisement

Advertisement

కాగ మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీ గా ఉంది. అయితే త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల కాబోతుంది. అలాగే మెగా స్టార్ గాఢ్ ఫాద‌ర్, భోళ శంక‌ర్ సినిమాల షూటింగ్ లు జ‌రుగుతున్నాయి. వీటి త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నారు. కాగ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప పార్ట్ 1 హిట్ మూడ్ లో ఉన్నాడు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి లో పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం అవుతుంది. దీని త‌ర్వాత మెగా స్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా వ‌చ్చే అవకాశం ఉంది. కానీ దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

read more.. ఉదయం లేవగానే ఈ 6తప్పులు అస్సలు చేయకండి….!

Visitors Are Also Reading