Home » రామ్ కు వ‌దిన‌గా మీరా జాస్మిన్..!

రామ్ కు వ‌దిన‌గా మీరా జాస్మిన్..!

by AJAY
Ad

సినిమా ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ హీరోలు విల‌న్ లుగా మెప్పిస్తుండ‌గా సీనియ‌ర్ హీరోయిన్ లు అక్కా వ‌దిన క్యారెక్ట‌ర్ లు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌లు చేస్తూ అల‌రిస్తుంటారు. ఇప్ప‌టికే భూమిక లాంటి ప‌లువురు హీరోయిన్ లు రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు హీరోయిన్ మీరా జాస్మీన్ కూడా రీఎంట్రీకి రెడీ అవుతోంది.

Meera jasmeen

Advertisement

అంతే కాకుండా గతంలో ఎంతో ప‌ద్ధ‌తిగా కనిపించిన మీరాజాస్మీన్ ఇప్పుడు గ్లామ‌ర్ డోస్ పెంచి మ‌రీ సినిమాల‌కు సై అంటోంది. అయింతే ఎంత గ్లామ‌ర్ డోస్ పెంచినా ఇప్పుడు హీరోయిన్ అవకాశాలు వ‌చ్చే ఛాన్స్ లేదు. కానీ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లు చేసే అవ‌కాశాలు మాత్రం వ‌స్తాయి. ఇక ఇప్పుడు అందాల మీరా జాస్మీన్ కు కూడా క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

త్రివిక్రమ్ రామ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా అనుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో మీరా జాస్మీన్ న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సినిమాలో రామ్ కు వ‌దిన పాత్ర‌లో మీరా జాస్మీన్ న‌టించ‌బోతుంద‌ని కూడా టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading