మెడికల్ విద్యార్థి ప్రీతి మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ర్యాగింగ్ భూతానికి ప్రీతి బలైంది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రీతిని సీనియర్ అయిన సైఫ్ వేధించడం వల్ల ప్రీతి ఆత్మహ* చేసుకుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఛాతిలో నొప్పి కారణంగా ప్రీతి ఒక్కసారిగా కింద పడిపోయింది. దాంతో వెంటనే వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ప్రీతి కన్ను మూసింది. కాగా గత కొద్దిరోజులుగా ప్రీతిని ఆమె సీనియర్ సైఫ్ వేధిస్తున్నాడని ర్యాగింగ్ చేస్తున్నాడని ప్రీతి తన తల్లిదండ్రులకు ఆరోపించింది. అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్ లో….. బుద్ధి లేదు అంటూ మెసేజ్ లు చేయడం వల్ల ప్రీతి తీవ్ర మనస్థాపానికి గురైందని తెలుస్తోంది.
Advertisement
అయితే ఆస్పత్రి యాజమాన్యం మరియు సైఫ్ తోటి విద్యార్థులు ప్రీతి ఆత్మహ* చేసుకోలేదని అనారోగ్య కారణాలవల్ల ఆమె చనిపోయిందని చెబుతున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తేల్చేందుకు ప్రస్తుతం ఈ కేసు పై విచారణ జరుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ప్రీతి ఆత్మహ* చేసుకోవడానికి 50 లక్షల బాండ్ కూడా ఓ కారణం అయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీజీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మధ్యలో మానేస్తే యూనివర్సిటీకి 50 లక్షలు చెల్లించాలి.
అదే ప్రీతి పాలిట శాపంగా మారిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. సైఫ్ వేధింపులు ఎక్కువ అవ్వడంతో చదువు మానేసి ఇంటికి రావచ్చు కదా అని తండ్రి అంటే…. 50 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాలి కదా ఎలా కడతావు…? వద్దులే… అని ప్రీతి తండ్రి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కేసులో దోషులు ఎవరు? అసలు ఏం జరిగింది అన్నది తెలియాలంటే మాత్రం పూర్తి విచారణ జరిగే వరకు వేచి చూడాల్సిందే.
Also read : Shardul Thakur : మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఫోటోలు వైరల్!