కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పూరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 1987 నుంచి తాను శ్రీవారిని దర్శించుకుంటున్నట్టు తెలిపారు. స్వామివారిని దర్శించుకుంటే సేవ చెయ్యాలన్న స్ఫూర్తి కలుగుతుందని, పెట్రోల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిందని అన్నారు. రాష్ట్రాలు కూడా తగ్గించాలి హరదీప్ సింగ్ డిమాండ్ చేశారు.
రామ కుప్పం మం. విజలపురంలో రాత్రి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో దోపిడీ జరిగింది. గ్యాస్ వెల్డింగ్ వంటి వాటిని దొంగలు ఆయుధాలుగా ఉపయోగించి మెయిన్ షట్టర్ డోర్ కట్ చేసారు. ఆనంతరం లోపలికి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. నగదు, బంగారం ఎంతపోయిందో ఇంకా తెలియలేదు.
Advertisement
వైసీపీ మంత్రుల సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర కర్నూలు జిల్లా నంద్యాలకు చేరుకుంది. తెల్లవారు జామున గంటలకు యాత్ర నంద్యాలకు చేరింది. కాసేపట్లో నంద్యాల నుండి బస్సు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది.
నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ సిటీలో ఉన్న ఒక చర్చి వద్ద తొక్కిసలాట జరిగింది. ఉచితంగా ఆహారం, కానుకలు పంచడం తో ప్రజలు ఎగబడ్డారు. ఈ తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తర కొరియా దేశానికి ఊరట లభించింది. అణు సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు సాగిస్తున్న ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదన ఐక్యరాజ్యసమితితో వీగిపోయింది. ఈ తీర్మానాన్ని చైనా, రష్యా వీటో చేయడంతో ప్రపంచ దేశాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.
Advertisement
పీఎం కిసాన్ యోజన పథకం కింద రాష్ట్రంలో లక్షల మంది రైతులు ఆధార్ వివరాలు ఇంకా నమోదు కాలేదు. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులైన రైతులను గుర్తించడానికి కేంద్రం అనేక నిబంధనలు తీసుకువచ్చింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి ఆధార్ నమోదు తప్పనిసరి చేసింది. అంతే కాకుండా కొత్తగా పీఎం కిసాన్ నమోదు 31 వరకు గడువు పెంచండి.
బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా ఈ హీరోయిన్ కు కోర్టులో ఊరట లభించింది.
నరేంద్ర మోడీ పాలన ఎనిమిదవ వార్షికోత్సవాలు రెండు వారాల పాటు ఘనంగా నిర్వహించాలని బిజెపి అధిష్టానం నిర్ణయించింది. ఈనెల 30 నుండి వచ్చే నెల 14 వరకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనకు సిద్ధమవుతోంది.
బంగారం ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా 24 క్యారెట్ ల బంగారం ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది.
ప్రధాని మోడీ భీమవరం లో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జూలై 4న మోడీ ప.గో జిల్లా భీమవరం లో పర్యటించనున్నారు.