Home » May 28Th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 28Th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు నివాళ్లు అర్పించారు.

Advertisement

తిరుమల టీటీడీ ఫ్లోర్ మిల్ లో గ‌త రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో అగ్నిమాప‌క సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థ‌లాన్ని ఇఓ ధర్మారెడ్డి ప‌రిశీలించారు.

తిరుపతిలో 16 ఏళ్ల అబ్బాయికి ప‌దేళ్ల బాలిక‌తో వివాహం జ‌రిపించారు. దాంతో బాల్య వివాహ నిరోధక చట్టం కింద నలుగురిపై కేసు నమోదయ్యింది. తిరుపతి రాఘవేంద్ర స్వామి మఠంలో 16ఏళ్ళ అబ్బాయికి పదేళ్ళ బాలికతో వివాహం జ‌రిపిస్తుండ‌గా వివాహ వేడుకలను జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి అడ్డుకుని కేసు న‌మోదు చేశారు.

ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంత‌రం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. నిమ్మకూరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామ‌ని చెప్పారు. నిమ్మకూరులో 30 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అన్ని తరాలకు ఎన్టీఆర్ ఆద‌ర్శ‌మూర్తి అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోడీ టిఆర్ఎస్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీష్ రావు ఖండించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ, అమిత్ షా అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి, టిడిపికి పట్టిన శనిగ్రహం చంద్రబాబు అని కొడాలి ఫైర్ అయ్యారు. మహానాడులో అడ్రస్ లేని వాళ్ళని కూర్చోపెట్టుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ల పేరు వింటే చంద్రబాబుకు నిద్ర పట్టదు అని వ్యాఖ్యానించారు.

నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,750 గా ఉందని, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 50,290 గా ఉంది.

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తో పాటు అన్ని ఫెడరల్ వెబ్సైట్లలో ఇంగ్లీష్ లో ఉండే సమాచారాన్ని భారతీయ భాషల్లో తెలుగు, హిందీ, గుజరాతీ, పంజాబీ భాషల్లోకి అనువదించాలని నిర్ణయం తీసుకున్నారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల తరహాలోనే సెమీ హై స్పీడ్ రైళ్లు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ రైళ్లు పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ లో వీటిని తయారు చేస్తున్నారు.

రాబోయే కాలంలో భారత్ కు సూపర్ సైక్లోన్ ల ముప్పు పెరుగుతుందని…. దీనివల్ల విధ్వంసకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ క్రిస్టల్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు.

Visitors Are Also Reading