టీడీపీ మహానాడు ప్రారంభం అయ్యింది. ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. మండవవారిపాలెం గ్రామస్థులు మహానాడు ప్రాంగణం ఏర్పాటు ఆహ్వానించగా చంద్రబాబు ఆ గ్రామానికి వెళ్లారు. మహానాడు కోసం మండవవారిపాలెం రైతులు తమ పొలాలను ఇవ్వగా చంద్రబాబు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
అనకాపల్లిలోని నర్సీపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం నుంచి మాకవరపాలెం వెళ్తుండగా కారు చెట్టును ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్ లు జరిగాయి. శ్రీనగర్ సౌరా, అవంతిపురాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్‌ను హతమార్చిన ఉగ్రవాదులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లపై స్పీడ్ లిమిట్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లై ఓవర్ లపై 80 కి.మీ. వేగంతో ప్రయాణించేందుకు అనుమతిచ్చారు. ఆస్పత్రులు, స్కూల్ జోన్‌లలో మాత్రం 40 కి.మీ. వేగానికి పరిమితి విధించారు. మిగతా అన్ని రోడ్లలో 60 కి.మీ. స్పీడ్ లిమిట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Advertisement
ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం తెలిపింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. పురుషులకు జూన్ 22 నుంచి జూలై 3 వరకు, మహిళలకు జూన్ 28 నుంచి జూలై 3 వరకు మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
గుజరాత్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా డ్ర* ను పట్టుకున్నారు. ముంద్రా పోర్ట్‌లో రూ.500 కోట్ల విలువైన డ్ర* పట్టుకోగా 52 కిలోల కొకై* అధికారులు సీజ్ చేశారు.
మన పొరుగు దేశం పాకిస్థాన్ కూడా శ్రీలంక బాటలో పయనిస్తోంది. పాకిస్థాన్ లో కూడా ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకుంది. పాకిస్థాన్ లో విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దాంతో పాకిస్థాన్ పరిస్థితి పై నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ఎక్కవ మరణాలకు కారణం హృద్రోగ సమస్యలు, అస్తమా, న్యుమోనియాలే అని ఆర్జీఐ తన నివేధికలో పేర్కొంది. 45 ఏళ్లు దాటినవారిలో హృద్రోగ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రకటించింది.
తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 నిమిషాల ముందు కూడా ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
కోనసీమలో ఇంటర్నెట్ బంద్ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. దాంతో బ్యాంకింగ్ సేవలు కూడా బంద్ అవ్వడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.