Home » May 24Th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 24Th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

శ్రీలంకలో మరోసారి పెరిగిన పెట్రో ధరలు బ‌గ్గుమ‌న్నాయి. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 445 ల‌కు చేర‌గా…. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.450 కు చేరుకుంది. ఇప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ దొర‌క‌డం లేదు.

Ap cm jagan

Ap cm jagan

దావోస్ లో జ‌రిగిన వ‌రల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఏపీ స‌ర్కార్ పలు కీలక పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంది. ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ కోసం భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. రూ.60 వేల కోట్లు భారీ పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రీన్ ఎన‌ర్జీ సంస్థ ముందుకు వ‌చ్చింది.

Advertisement

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశామ‌ని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రతిపక్ష టీడీపీ ఈ విషయాన్ని రాజకీయలబ్ది కోసం వాడుకోవాలని చూస్తోందంటూ హోంమంత్రి ఆరోపించారు.

శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ కీల‌క సూచ‌న చేసింది. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్న‌ట్టు టీటీడీ ప్ర‌క‌టించింది.

Advertisement

తెలంగాణ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ నుండి స‌మీపంలో ఉన్న బ‌స్టాండ్ ల‌కు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను న‌డపాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. వారం ప‌దిరోజుల్లోనే ఈ వాహ‌నాలు అందుబాటులోకి రానున్నాయి.

సీఎం కేసీఆర్ ఈనెల 20న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. కాగా అర్ధాంత‌రంగా ఆయ‌న త‌న ప‌ర్య‌న నుండి హైద‌రాబాద్ చేరుకున్నారు. నేడు రేపు జ‌ర‌గాల్సిన చ‌ర్చ‌లు, భేటీలు వాయిదా ప‌డ‌టంతో ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నారు.

క‌ర్నాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. హుబ్లీ స‌మీపంలో బ‌స్సు లారీ ఢీ కొని 9మంది మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో 23 మంది గాయ‌ప‌డ్డారు.

క‌రోనా వ‌ల్ల రెండేళ్లుగా ర‌ద్దయ్యిన హ‌జ్ యాత్రం ఈ యేడాది కొన‌సాగ‌నుంది. తాజాగా హ‌జ్ యాత్ర షెడ్యూల్ ను కేంద్రం విడుద‌ల చేసింది.

తెలంగాణ‌లో ఇంట‌ర్ పరీక్ష‌లు నేటితో ముగియ‌నున్నాయి. జూన్ 20వ తేదీ లోప‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డించాల‌ని ఇంట‌ర్ బోర్డు క‌స‌ర‌త్తు చేస్తోంది.

Visitors Are Also Reading