Home » May 23rd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 23rd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో గడిచిన 24 గంటల్లో 2,022 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 46 మంది మృతి చెందారు.

ఏపీలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి టీడీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. టిడిపి అధినేత చంద్రబాబు మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో 80 మంకీపాక్స్‌ కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.

నేడు తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుండి జూన్‌ 1వ తేదీ వరకు తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరగనుంది. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Mk Stalin

2021 లో ఎన్నికైన అస్సాం, వెస్ట్ బెంగాల్ ,తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పై Ians సీఓటర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే లో అత్యధికంగా 85 శాతం ప్రజల మద్దతు సీఎం స్టాలిన్ కే లభించింది.

Advertisement

పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు తగ్గించడం వల్ల భారం అంతా కేంద్రమే భరిస్తుందని రాష్ట్రాల పై ఎలాంటి ప్రభావం పడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎక్సైజ్ సుంకం లో కోత వల్ల కేంద్రం రూ. లక్ష కోట్లు ఆదాయం కోల్పోతుంది అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

నేడు బంగారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ ల బంగారం ధర రూ.47,050 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.614 గా ఉంది.

దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు భారతజట్టును ప్రకటించారు. రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి కల్పించారు.అంతే కాకుండా హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తీక్‌లకు జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ను నియమించారు.

ఈ నెల 26న టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ కానుంది. మహానాడు నిర్వహణ, మహానాడు తీర్మానాలపై సమీక్ష చేయనున్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. ముందస్తు ఎన్నికలకు అవకాశం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమం పై కూడా చర్చించనున్నారు.

దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు భారతజట్టును ప్రకటించారు. రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి కల్పించారు.అంతే కాకుండా హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తీక్‌లకు జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ను నియమించారు.

Visitors Are Also Reading