Telugu News » May 21st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 21st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY MADDIBOINA

మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్దంతి వేడుకలను నేడు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించారు. సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు నివాళ్లు అర్పించనున్నారు.

Ads

 

ఐపీఎల్ 2023లోనూ ఆడతానని ధోని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామని… ఐపీఎల్‌లో 2023 తనకు చివరి ఏడాది అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేనన్నారు.

 

కర్ణాటక లోని దర్వార్ సమీపంలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిశ్చితార్థానికి వెళ్లి వస్తున్న వ్యాను చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. వ్యానులో మొత్తం 20 మంది ఉన్నట్టు సమాచారం.

Pawan kalyan

Pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అవసరమైతే బిజెపి అధిష్టానాన్ని సైతం ఒప్పిస్తామని తెలిపారు. రాష్ట్రం బలంగా ఉండటమే తనకు ముఖ్యమని చెప్పారు. ఎక్కడ నుండి పోటీ చేసినా పవన్ ను ఓడిస్తామని చెబుతున్న వైసీపీ నేతల సవాలును స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

 

భారీగా పెరుగుతున్న టమాటో ధరలను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం రైతు బజార్లలో టమాటా విక్రయాలను ప్రారంభించింది. 47 బజార్ల ద్వారా నేటి నుండి తక్కువ ధరకు టమాటో విక్రయాలను చేపడుతోంది. ఈ మార్కెట్లలో 10 నుండి 15 రూపాయలు తక్కువ ధరకు ఇస్తున్నారు.

 

తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని కరీంనగర్, భూపాల్ పల్లి, పెద్దపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణపనులు షురూ అయ్యాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు నిన్న పూజలు చేసి పనులను ప్రారంభించారు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఆ పార్టీ రూ. 8 కోట్ల పైనే ఖర్చు చేసింది.

 

ముస్లిం విద్యార్థులు బుర్కా ధరించి పదో తరగతి పరీక్షలకు హాజరైనా కూడా వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులను మహిళా టీచర్లు చేత క్షుణ్ణంగా తనిఖీ చేయించాలని సూచించింది.

Ap cm jagan

Ap cm jagan

అమ్మఒడి లబ్ధిదారులకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. ప్రతి ఏడాది అమ్మ ఒడి పథకం కింద ఇస్తున్న రూ.15,000 ను ఇకనుండి రూ.13 వేలకు తగ్గిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.1000 తగ్గించగా ఇప్పుడు స్కూల్ మౌళిక సదుపాయాల నిర్వహణ పేరుతో మరో వెయ్యి కోత విధించారు.

 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాహుల్ గాంధీ ఎమోషనల్ వీడియో ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ పాలనలో సంస్కరణలు, పథకాల గురించి వివరించారు. తన తండ్రి దూరదృష్టి కలిగిన నాయకుడు అని ఆయన విధానాలు ఆధునిక భారత్ అబివృద్దికి సహాయపడ్డాయని తెలిపారు. తను ప్రియాంక గాంధీకి అద్భుతమైన నాన్నను మిస్ అవుతున్నామని ఎమోషనల్ అయ్యారు.


You may also like