టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చెన్నై లోని కోయంబేడు మార్కెట్‌లో టమాటా కేజీ ధర రూ.105 కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 70 కి పైనే పలుకుతోంది.
నేడు హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు బంద్ కు పిలుపునిచ్చాయి. వాహనాల ఫిట్నెస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ లారీ ఓనర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు బంద్ లో పాల్గొంటారు. అంతే కాకుండా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయ ముట్టడికి సైతం పిలుపునిచ్చారు.
Advertisement
నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నెల 25 కంటే ముందుగానే ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, తెలంగాణపై ఉపరితల ద్రోణి ఆవరించి ఉండటం తో మరో మూడు రోజుల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరశాఖ హెచ్చరించింది.
కేసీఆర్ సర్కార్ మందుబాబులకు షాక్ ఇచ్చింది. తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో బీరుపై రూ. 20, మద్యం క్వార్టర్ పై రూ.20, ఆఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ పై రూ.80 పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
Advertisement
ఏపీ సీఎం జగన్ నేడు పశువుల అంబులెన్స్ వాహనాలను ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర వాహనాలకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 వాహనాలను సీఎం ప్రారంభిస్తున్నారు.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీం ఇండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమించారు.
ఐపీఎల్ 2022 నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నో పై కోల్కతా విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్ లలో 210/0 పరుగులు చేయగా కోల్‌కతా నైట్‌రైడర్స్ 211 పరుగులు సాధించింది. డికాక్ 140, కేఎల్ రాహుల్ 68 పరుగులు చేశారు.
యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూపీ లో కొత్తగా ఏర్పాటు చేసిన మదర్సా లకు ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం గ్రాంట్ పొందుతున్న మదర్సలకు మాత్రం కొనసాగుతుందని మైనారిటీ శాఖ మంత్రి ప్రకటించారు.
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 14 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర 3.50 రూపాయలకు పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 8 రూపాయలు పెరిగింది.
ప్రముఖ వ్యాపార సంస్థ అదాని గ్రూప్స్ ఆరోగ్యసంరక్షణ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. ఆదాని హెల్త్ వెంచర్స్ లిమిటెడ్ పేరుతో పూర్తిస్థాయి అనుబంధ సంస్థను నెలకొల్పినట్టు స్పష్టం చేసింది.