Home » May 17th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 17th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

జూన్ రెండో వారంలో బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపట్టాలనే యోచనలో సంజయ్ మరియు అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అనుమతి కోరింది.

ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు ముంబైతో హైదరాబాద్‌ తలపడనుంది. ముంబై వేదికగా రాత్రి 7.30కి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Advertisement

సినీ నటి కరాటే కరాటే కల్యాణి అజ్ఞాతం వీడి బయటకు వచ్చింది. పాప దత్తత పై క్లారిటీ ఇచ్చింది. పాప తల్లి తండ్రులు తనకు తెలిసిన వాళ్ళని ఇంకా తాను దత్తత తీసుకోలేదని చెప్పింది. పాప తల్లి తండ్రులు పేద వారని వాళ్ళు కూడా తన వద్దనే ఉంటున్నారని చెప్పింది.

బీర్ల అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ఫస్ట్‌ లో నిలిచింది. వరంగల్‌ సెకండ్‌ ప్లేస్ లో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో 2.3 కోట్ల లీటర్ల బీర్లు అమ్ముడు పోయాయి. వరంగల్‌లో 1.15 కోట్ల లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి.

ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్ నియమితులయ్యారు. ఫ్రాన్స్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళగా బోర్న్ నిలిచారు. ప్రధాని జీన్ కాస్టెక్స్ తన పదవికి రాజీనామా చేయడం తో ఆయన స్థానం లో బోర్న్ ను ప్రధానిగా నియమించారు.

Advertisement

కరోనా సాకుతో మార్చి 20- 2020 నుండి రైళ్లలో ప్రయాణించే సీనియర్ సిటిజన్ల రాయితీని రైల్వేశాఖ నిలిపివేసింది. దాన్ని ఇప్పటికీ రైల్వేశాఖ పునరుద్ధరించలేదు. దాంతో రెండేళ్లలో వృద్ధులపై దాదాపు 1500 కోట్ల భారం పడినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయింది.

బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర.46,250 గా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర.50,450 గా ఉంది.

కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఏర్పాటు చేసిన భారీ పవర్ ప్రాజెక్టుకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేసే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా ఇది అవతరిస్తుందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా మే 19న ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన రోడ్డు భద్రత చట్టాన్ని సాకుగా చూపించి ఆలస్యమైతే రోజుకు రూ.50 ఫైన్ అదనంగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ జెఏసి బంద్ కు పిలుపునిచ్చింది.

Visitors Are Also Reading