ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. సైమండ్స్ 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ కన్నుమూశారు.
తెలంగాణా రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నేడు ఖమ్మం లో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించనున్నారు.
Advertisement
తిరుమల లో పార్వేటి మండపం వద్ద ఏనుగులు హల్ చల్ చేశాయి. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
టమోటా ధర ఆకాశాన్ని తాకింది. మదనపల్లె మార్కెట్లో కిలో టమోటా ధర రూ.70కి చేరుకుంది.
బాసరలోని సరస్వతీ ఆలయం వద్ద గోదావరి నది ప్రమాదాలకు అడ్డాగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, రక్షణ వ్యవస్థ లేకపోవడంతో దర్శనానికి వచ్చిన వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఏప్రిల్ లో ఓ విద్యార్థి గోదావరి లో మరణించగా తాజాగా ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయ శాస్త్రవేత్తలతో భేటీకానున్నారు. జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రూపకల్పన సన్నాహాల్లో భాగంగా కేసీఆర్ ఈ నెల 20న వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులతో భేటీ కానున్నారు.
Advertisement
ఉత్తర కోస్తాంధ్ర పై గాలులతో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావంతో ఈరోజు రేపు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
స్పేస్ ఎక్స్ మరోసారి సత్తా చాటింది. స్టార్ లింక్ ప్రాజెక్టు ద్వారా 53 ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపింది. ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ సాటిలైట్స్ ను పంపించింది.
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణం పేరిట ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఒక కార్యక్రమం చేపట్టనుంది. అంతేకాకుండా క్రీడాప్రాంగణం కోసం ప్రతి గ్రామంలో ఎకరం నుండి ఏకరంన్నర స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో ఈ నెల 23 నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ పరీక్షలో సామాన్య శాస్త్రం, భౌతిక శాస్త్రం జీవశాస్త్రం సబ్జెక్టులకు వేరు ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.