బిజేపి సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు కురిపించారు. బీజేపీ హయాంలో ద్రవ్యోల్బణం పెరిగింది, నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై మీ సమాధానం ఏమిటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24వేలకోట్ల నిధులు ఇవ్వాలని NITI ఆయోగ్ చెప్పినా ఎందుకివ్వలేదు? అంటూ ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని నిలదీశారు.
ఏపీలో విద్యార్ధి సంఘాల ఛలో రాజ్ భవన్ పిలుపుతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రాజ్ భవన్ ముట్టడి పిలుపు చట్ట విరుద్ధమని స్పష్టం చేసారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తామని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని విజయవాడ సీపీ హెచ్చరించారు.
Advertisement
నేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముండ్రా మెట్రో స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో 26 మంది మృతి చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.24 ఫైరింజన్లతో సిబ్బంది మంటలార్పుతున్నారు.
ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేష్ కుమార్ మీనా నియామకమయ్యారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది.
Advertisement
ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో జపాన్ లో రోడ్ షో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. జపాన్ లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే జపాన్ కంపెనీ వాళ్లతో జగన్ సమావేశం లో పాల్గొంటారు. అనంతరం జపాన్ లో రోడ్ షో నిర్వహిస్తారు.
దేశంలో 2,858 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల గడిచిన 24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 750 తగ్గి 46,450 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.50,670 కి చేరుకుంది.
శ్రీలంక మాజీ ప్రధాని రాజపక్స ను అరెస్టు చేయాలని ఆ దేశ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిరసన తెలుపుతున్న వాళ్లను బెదిరించడంతో పాటు దాడులకు పాల్పడ్డారని ఆరోపణలతో అరెస్ట్ చేయాలని కోర్టు సీఐడిని ఆదేశించింది.