Home » May 13th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 13th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తిరుపతి మదనపల్లెలో NIA సోదాలు చేస్తోంది. అమ్మచెరువుమిట్ట సమీపంలోని ఓ ఇంటిలో NIA బృందం సోదాలు నిర్వ‌హిస్తోంది. అంజి అలియాస్ ఆంజనేయులును ఇప్ప‌టికే అరెస్టు చేశారు. పలు కీలమైన డాక్యుమెంట్లు ,ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 25వ తేదీన ఒకసారి ఆంజనేయులును అరెస్టు విచారించారు.

తిరుపతి చంద్రగిరిలో అదృశ్యమైన ఇద్ద‌రు డిగ్రీ విద్యార్థినుల ఆచూకీ లభ్యం అయ్యింది. విద్యార్థినులు మహారాష్ట్రలో షోలాపూర్ లో ఉండ‌టంతో వారిని గుర్తించి నేడు పోలీసులు చంద్రగిరికి తీసుకుస్తున్నారు.

Advertisement

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నేడు కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్ నిర్వ‌హిస్తున్నారు. మూడురోజుల పాటు నవ సంకల్ప్ శిబిర్ నిర్వ‌హించారు.

Ap cm jagan

Ap cm jagan

తుఫాన్ ఎఫెక్ట్ తో నేడు సీఎం జ‌గ‌న్ కోనసీమ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. సీఎం పర్యటనతో పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అంబేద్కర్ జిల్లా సాధన సమితి నేతలు అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసుల అలర్ట్ అయ్యారు. ఇప్పటికే జిల్లాలో సెక్షన్ 30 అమలు చేశారు.

Advertisement

ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కేంద్ర‌మంత్రి అమిత్ షాతో స‌మావేశామయ్యారు. అమిత్‌షాతో అనేక‌ విషయాలు చర్చించినట్టు తెలిపారు. తెలంగాణలో అవినీతి జరుగుతోందని త‌న పై జరిగిన దాడిని కేంద్రమంత్రి అమిత్‌షా ఖండించారని చెప్పారు. త‌న‌కు అమిత్ షా భరోసా ఇచ్చారని తెలిపారు.

థామ‌స్ క‌ప్ లో భార‌త్ స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 1979 త‌ర‌వాత తొలిసారి థామ‌స్ క‌ప్ సెమీస్ లోకి భార‌త్ అడుగుపెట్టింది.

ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన‌ కంపెనీగా సౌదీలోని ఆరోంకో నిలిచింది. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడుల‌తో చ‌ముదు ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దాంతో సౌదీలోని సౌదీలోని ఆరాంకో షేర్లు విప‌రీతంగా లాభ ప‌డ్డాయి.

శ్రీలంక కొత్త ప్ర‌ధానిగా రనిల్ విక్ర‌మ‌సింఘే ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అధ్య‌క్షుడు గొట‌బ‌యా రాజ‌పక్స‌నే ద‌గ్గ‌రుండి ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు.

క‌ర్నాక‌ట ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మ‌త‌మార్పిడుల నిరోధ‌క బిల్లుకు శాస‌న‌మండ‌లిలో మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోవ‌డంతో ఆర్డినెన్స్ తీసుకురావాల‌ని మంత్రివ‌ర్గం నిర్నయించింది.

modi

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వంద‌శాతం అమ‌లైతే స‌మాజంలోని వివ‌క్ష‌ను రూపుమాప‌వ‌చ్చని ప్ర‌ధాని మోడీ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బుజ్జ‌గింపు రాజ‌కీయాల‌కు కూడా ముగింపు ప‌ల‌క‌వ‌చ్చ‌ని చెప్పారు.

Visitors Are Also Reading