Home » May 10th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 10th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తిరుపతిలో ప్రైవేటు డిగ్రీ కాలేజీ హాస్ట‌ల్ నుండి నలుగురు విద్యార్థులు పారిపోయారు. అయితే ఇంకా ఆ విద్యార్థుల ఆచూకీ ల‌భించ‌లేదు. తిరుమల, బెంగుళూరు, విశాఖపట్నంకు చెందిన ప్రత్యేక పోలీస్ బృందాలు విద్యార్థినుల ఆచూకీ కోసం వెతుకుతున్నాయి. 24గంటల గడుస్తున్నా ఆచూకీ లభ్యం కాకపోవడంతో విద్యార్థినుల‌ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Ap cm jagan

Ap cm jagan

ఏపీలో ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్ష స‌మావేశం నిర్వ‌హించనున్నారు. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటకు సమీక్ష స‌మావేశం ప్రారంభం కానుంది. ఈ స‌మావేశంలో పోలవరం, సంగంతో సహా పలు ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎం జగన్ స‌మీక్షించ‌నున్నారు.

Advertisement

 

తూర్పుగోదావరి జిల్లాను అసాని తుఫాను వ‌నికిస్తోంది. తుఫాన్ ముప్పుతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చ‌రించ‌డంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.

 

పంజాబ్ లోని మొహాలీ ఇంటెలిజెన్స్‌ ఆఫీస్‌లో పేలుడు సంభ‌వించింది. దాంతో ఆఫీస్‌ అద్దాలు, తలుపులు ధ్వంసం ద్వంసం అయ్యాయి. ఆఫీసుపై రాకెట్‌ దాడి జరిగినట్లు పోలీసలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

 

హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ఏడాది ఇక్కడి నుంచి సుమారు 1,000 మంది ఉద్యోగులు కంపెనీ కోసం పని చేస్తార‌ని స్ప‌ష్టం చేసింది.

 

శ్రీలంక‌లో ఇప్ప‌టికీ ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆ దేశ అధ్య‌క్షుడు రాజ‌ప‌క్స ఇప్ప‌టికే రాజీనామా చేశారు. మ‌రోవైపు ఆందోళ‌న‌కారులు ఆయ‌న ఇంటికి నిప్పుపెట్టారు. మంత్రుల ఇండ్ల‌పై సైతం దాడి చేశారు.

 

ఐపీఎల్ 2022 గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్ లో కోల్ క‌తా చేతిలో ముంబైఇండియ‌న్స్ దారుణంగా ఓడిపోయింది. 166ప‌రుగుల ఓ మోస్త‌రు ల‌క్ష్యాన్ని ముంబై చేదించ‌లేక‌పోయింది.

 

టీఎస్ఎస్పీడీసీఎల్ లో ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. 1000లైన్ మెన్ ఉద్యోగాలు, 70 అసిస్టెంట్ ఇంజ‌నీర్ ఉద్యోగాలు, 201 స‌బ్ ఇంజనీర్ పోస్ట్ ల‌కు నోటిఫికేష‌న్ ను జారీ చేసింది. ఈనెల 11 నుండి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

corona omricon

corona omricon

సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ ఉదృతి క‌నిపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివిటి రేటు పెరిగిపోయింది.

 

తెలంగాణ‌లో వ‌చ్చేది డ‌బుల్ ఇంజన్ స‌ర్కార్ అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ దీమా వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా పాద‌యాత్ర ముగింపు స‌భ‌ను చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.

Visitors Are Also Reading