Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » వారి పోస్ట్ వెడ్డింగ్‌.. భారీ కేక్ క‌ట్‌..!

వారి పోస్ట్ వెడ్డింగ్‌.. భారీ కేక్ క‌ట్‌..!

by Anji
Ads

వారి ఆనందం అంబ‌రాన్ని అంటుతున్న స‌మ‌యంలో హ‌ద్దులు ఆకాశాన్ని సైతం దాటుతుంటాయి. ఆ స‌మ‌యంలో ఏ మాత్రం అవ‌కాశాలు చిక్కినా వ‌ద‌లొద్దు అంటూ మ‌న‌స్సు ఆరాట‌ప‌డుతుంది. ఈ ప‌రిస్థితిలో మౌనీరాయ్, సూర‌జ్ నంబియార్ ఉన్నారు. అస‌లే ప్రేమ వివాహం, స్నేహితుల స‌మ‌క్షంలో వివాహ‌నంత‌ర కార్య‌క్ర‌మం హ‌ద్దులుంటాయా చెప్పండి. వెడ్డింగ్‌లో చేసిన హంగామా ఇప్పుడు వీడియో రూపాన సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

Advertisement

Mouni Roy's Bengali wedding is all things beautiful. See photos, videos |  Entertainment News,The Indian Express

Ad

అమ్మాయి మౌనిరాయ్ బెంగాలీ బామ‌, అబ్బాయిగారు సూర‌జ్ నంబియార్ మ‌ళ‌యాళి బాబు. వీరు ప్రేమ‌తో క‌లిసి పెళ్లితో ఒక్క‌ట‌య్యారు. ఒక వైపు బెంగాళీ సంప్ర‌దాయంలో ఉత్స‌వం, మ‌రొక వైపు మ‌ళ‌యాళీ లో వివాహ వేడుక పూర్తయిన త‌రువాత త‌మ మిత్రులు, స‌న్నిహితుల‌తో పోస్ట్ సెర్మ‌నీ జ‌రుపుకున్నారు మౌని, సూర‌జ్ దంప‌తులు.

Advertisement

Mouni Roy-Suraj Nambiar Will Tie The Knot Again In A Bengali Wedding,  Followed By A

ఇందులో మ‌రొక అద్బుత విశేషం ఏమిటంటే.. భారీ కేక్‌ను క‌ట్ చేసే ప‌నిలో ప‌డ్డారు కొత్త దంప‌తులు. చుట్టూ స‌న్నిహితుల కోలాహ‌లం, అయినా ఎవ్వ‌రినీ లెక్క చేయ‌కుండా కేక్ క‌ట్ చేస్తూనే muద్దు, ముచ్చ‌ట సాగింది. అర్జున్ బిజ్లానీ చేస్తున్న హంగామా కూడా ఆక‌ట్టుకుంది. న‌వ‌దంప‌తుల ద్దు, ముచ్చ‌ట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా హంగామానే చేస్తోంది. దంప‌తుల‌కు స‌న్నిహితులైన మందిరా బేడీ, ఆష్కా గోర‌డీ, మ‌న్‌మీత్ సింగ్‌, ఓంకార్ క‌పూర్, రాహుల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. న‌వ వ‌ధూవ‌రుల జీవ‌న యాత్ర సుఖ‌వంతంగా సాగాల‌నే అంద‌రూ అభిలాషిస్తున్నారు.

Visitors Are Also Reading