Home » చైనాలో భారీ భూకంపం..సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌..!

చైనాలో భారీ భూకంపం..సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌..!

by Anji
Ad

చైనాలో నైరుతి సిచువాన్ ప్రావిన్స్ యాన్ న‌గ‌రంలో భారీ భూకంపమే సంభ‌వించింది. న‌లుగు వ్య‌క్తులు మృతి చెంద‌గా.. 14 మంది గాయ‌ప‌డిన‌ట్టు చైనా అధికారులు వెల్ల‌డించారు. చైనాలో సంభ‌వించిన భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ 6.1గా న‌మోదు అయింది. చైనా భూకంప నెట్ వ‌ర్క్‌ల‌కేంద్రం ప్ర‌కారం.. సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో యాన్ న‌గ‌రంలోని లుషాన్ కౌంటీలో భూకంపం వ‌చ్చింది.

Advertisement

భూకంప కేంద్రం 17 కిలోమీట‌ర్ల లోతులో ఉన్న‌ద‌ని సీఈఎన్‌సీ తెలిపింది. భూకంపం సంభ‌వించిన‌ప్పుడు మూడు నిమిషాల త‌రువాత యాన్ న‌గ‌రంలోని బాక్సింగ్ కౌటిలో 4.5 తీవ్ర‌త‌తో మ‌ళ్లీ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. చైనాలో సంభ‌వించిన భూకంపం వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. భూకంపం సంభ‌వించిన తీరు అక్క‌డి జ‌నాలు భ‌యంతో ప‌రుగులు తీసిన విధానం అన్నీ ఆయా సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఆ పుటేజీలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నాయి. భూ ప్ర‌కంప‌న‌లు భారీగా రావ‌డంతో ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి షాపింగ్ మాల్స్ నుంచి రోడ్లపైకి వ‌చ్చారు. పాఠ‌శాల‌ల పిల్ల‌లు బ‌య‌టికి ప‌రుగులు తీశారు.

Advertisement

 

టిబెట‌న్ పీఠ‌భూమిలో ఉన్న ప్రావిన్స్‌లో 2008లో 7.9 తీవ్ర‌త‌తో సంభ‌వించిన భూకంపం వ‌ల్ల ప్ర‌భావిత‌మైన వారి కోసం నిర్మించిన ఇండ్ల‌తో పాటు భూకంపం, అనంత‌ర ప్ర‌కంప‌న‌ల‌తో కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దెబ్బ‌తిన్న భ‌వ‌నాల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టెలిక‌మ్యూనికేష‌న్ దెబ్బ‌తిన్న‌ది. అత్య‌వ‌స‌ర మ‌ర‌మ్మతుల త‌రువాత కొన్ని ఆప్టిక‌ల్ కేబుల్స్ పున‌రుద్ధ‌రించ‌బ‌డ్డాయి. యాన్‌లో భూకంపం నేప‌థ్యంలో చైనా ప్ర‌భుత్వం వేగంగా స్పందించింది. ఎమ‌ర్జెన్సీ రెస్య్కూ, ఇత‌ర విభాగాల నుంచి 4,500 మందికి పైగా సిబ్బంది భూకంప ప్రభావిత ప్రాంతాల‌కు చేరుకొని సహాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Also Read : 

ఐఫోన్ అంటే ఇష్ట‌ప‌డే వారికి శుభ‌వార్త‌.. ఆ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..!

ఎమోష‌న‌ల్ నోట్ రాసిన కీర్తి సురేష్‌.. అందులో ఏముందంటే..?

 

Visitors Are Also Reading