Telugu News » Blog » దుమ్ము రేపుతున్న మాస్ ‘ధమాకా’.. ఆ హీరోలందరికీ కౌంటర్..! 

దుమ్ము రేపుతున్న మాస్ ‘ధమాకా’.. ఆ హీరోలందరికీ కౌంటర్..! 

by Anji
Published: Last Updated on
Ads

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధమాకా. ఈ సినిమాలో రవితేజ సరసన టాలీవుడ్ ఫెవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రసన్నకుమార్ బెజవాడ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి అసోసియేట్ సాయికృష్ణ కథ అందించడం గమనార్హం.  

Advertisement

శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 23న తేదీన విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ తాజాగా  రిలీజ్ చేశారు. 2 నిమిషాల 7 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ అయితే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కోట్లలో ఒకడు వాడు కొడితే కోలుకోలేవు. మనకు కావాల్సిన వారికి చేస్తే.. మోసం మనం కావాలి అనుకున్న వారి కోసం చేస్తే న్యాయమంటూ కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తే.. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.  

Advertisement

Also Read :  శని ప్రభావం వల్ల జనవరి 17 నుంచి ఆ రెండు రాశుల వారికి కష్టాలు తప్పవు..!

 శ్రీలీల విషయాన్ని సినిమా ట్రైలర్ లో క్లారిటీ వచ్చేవిధంగా చెప్పేసింది. ఒకరు తన ఫ్రెండ్ అన్నయ్య అని మరొకరు తండ్రి ఫ్రెండ్ కొడుకు అని వారిద్దరూ తనకు నచ్చారు అంటూ తల్లితో చెబుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. హీరోయిన్ ఇద్దరినీ ఇష్టపడడం మరింత ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ట్రైలర్ లో రవితేజ మాస్ అప్పియరెన్స్ తో రెచ్చిపోయారు. ట్రైలర్ చివరిలో నేను వెనకున్న వాళ్లను చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్.. వెనుక ఎవ్వరూ లేకపోయినా ముందుకు రావచ్చని ఎగ్జాంపూర్ సెట్ చేసిన వాడిని అంటూ చెప్పిన డైలాగ్ నెపో స్టార్స్ అందరికీ రవితేజ కౌంటర్ ఇచ్చినట్టు అయింది. డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తం ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

Advertisement

Also Read :  బిగ్ బాస్ ఇనాయా కు గతంలో పెళ్లి జరిగిందా ..? నెట్టింట పెళ్లి ఫోటో వైరల్…!