Home » మారుతి తెలివి.. ప్రభాస్ లేకుండా షూటింగ్..!

మారుతి తెలివి.. ప్రభాస్ లేకుండా షూటింగ్..!

by Azhar
Ad
పాన్ ఇండియా హీరోగా టాప్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం నాలుగు సినిమాలకు పచ్చజెండా ఊపాడు అనే విషయం తెలిసిందే. అందులో ఇప్పుడు సాలార్, ప్రాజెక్ట్ కే అనే సినిమాల షూటింగ్ అనేది జరుగుతుంది. వీటితో పాటుగా.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి… అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమాలు ఒప్పుకున్నాడు ప్రభాస్. అయితే సినిమా షూటింగ్ లను చాలా తొందరగా పూర్తి చేయాలనీ వేగంగా చేస్తూ వస్తున్నాడు.
గత నెలలోనే మారుతి సినిమా యొక్క పూజ కార్యర్కాణాలు కూడా పూర్తయ్యాయి. కానీ అనుకోకుండా ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు మరణంతో అన్ని షూటింగ్స్ అనేవి ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ ఏ షూటింగ్ కు కూడా వెళ్లడం లేదు. అందుకే ప్రభాస్ యొక్క అన్ని సినిమాలు ఆగిపోయిన.. మారుతి మాత్రం తెలివిగా ప్రభాస్ లేకుండానే షూటింగ్ అనేది చేస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే కృష్ణం రాజు చనిపోయిన రోజు షూటింగ్ అనేది ఆపేసిన.. త్వరగా ప్రభాస్ మళ్ళీ షూట్ కు రాడు అని గ్రహించి.. ప్రభాస్ లేని సీన్స్ ను షూట్ చేస్తున్నాడట మారుతి. ఈ సినిమాలో నటిస్తున్న మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ యొక్క సీన్స్ అనేవి ప్రస్తుతం మారుతి తీస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే హొంటింగ్ లో పాల్గొనడానికి మాళవిక మోహనన్ హైదరాబాద్ కూడా వచ్చింది. అందువల్లే మారుతి యొక్క షూటింగ్ గురించి వార్తలు మొదలయ్యాయి.

Advertisement

Visitors Are Also Reading