Home » ప్ర‌భాస్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన మారుతి…!

ప్ర‌భాస్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన మారుతి…!

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌స్తుతం స‌లార్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో పాటూ ప్ర‌భాస్ ఆదిపురుష్ అనే మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రంలో న‌టిస్తున్నాడు. అంతే కాకుండా ఇప్ప‌టికే ప్ర‌భాస్ రాధే శ్యామ్ అనే సినిమాను పూర్తిచేయ‌గా ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. అయితే ఇదిలా ఉండ‌గా ప్ర‌భాస్ సినిమాల‌పై మ‌రో ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Prabhas with maruthi

Advertisement

ప్ర‌భాస్ బ‌డా సినిమాకు గ్యాప్ తీసుకుని ఓ మంచి ప్రేమ క‌థా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నుకుంటున్నార‌ని ఈ చిత్రం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఫిక్స్ అయ్యింద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా సినిమాను డీవీవీ బ్యాన‌ర్ పై నిర్మిస్తార‌ని కూడా టాక్. అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా మారుతి స్పందించాడు.

Advertisement

త‌న ఫ్యూచ‌ర్ సినిమాల‌పై ర‌క‌ర‌కాల వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుడుతున్నాయ‌ని మారుతి పేర్కొన్నారు. ఫ‌ల‌నా హీరోతో సినిమా ఫ‌లానా బ్యాన‌ర్ లో సినిమా అని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే స‌మయం అన్నింటికీ స‌మాధానం చెబుతుంది. వేచి చూద్దాం. నా మంచి కోరుకుంటున్న‌వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. క‌రోనా సమ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోండి అంటూ పేర్కొన్నారు. ఇక మారుతి చేసిన ట్వీట్ తో అస‌లు సినిమా ఉంటుందా లేదా అన్న‌ది ఇంకా మారుతికి కూడా క్లారిటీ లేద‌ని అర్థం అవుతోంది. అంటే ఈ సినిమా పై ఇంకా డిష్క‌ర్ష‌న్స్ జ‌రుగుతున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

Visitors Are Also Reading