ఈరోజుల్లో చాలామంది చిన్న చిన్న విషయాలనే పెద్ద వాటిగా భావించి మనస్థాపానికి గురై ఘోరమైన నిర్ణయాలని తీసుకుంటున్నారు. నిజానికి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. భార్య భర్తల మధ్య గొడవలు సాధారణంగా వస్తూ ఉంటాయి. వాటిని ఎక్కువగా ఊహించుకోవడం సడన్ గా నిర్ణయాలు తీసుకోవడం వంటివి మంచివి కావు. ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం వలన నష్టపోయేది మనమే. దేశంలో ఇటువంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక ఘటన చోటుచేసుకుంది.
Advertisement
Advertisement
ఇక వివరాల్లోకి వెళితే… అంతర్వేది సముద్రంలో యువజంట గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపింది. కార్తీక మాసం చివరి సోమవారం కనుక సముద్ర స్థానానికి చాలామంది వచ్చారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా కి చెందిన నవ దంపతులు రేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి కూడా వచ్చారు. భార్య భర్తలు వాళ్ళ ఫోన్ ని సముద్రపు ఒడ్డున వదిలేసి చేతులుకి చున్నీ కట్టుకుని మరీ సముద్రంలోకి వెళ్లి గల్లంతైపోయారు.
అక్కడున్న వాళ్ళందరూ కూడా చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. పోలీసులు సఖినేటిపల్లి సముద్రం వద్ద గాలిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకు ఈ నవ దంపతులు ఎందుకు ఇలా చేసారు..? ఏమైంది అనే దానికి కారణాలు మాత్రం తెలీవు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!