Telugu News » Blog » ట్రాన్స్​జెండర్​తో కరీంనగర్‌ యువకుడి ప్రేమ వివాహం..సర్జరీ చేసుకుని మరీ !

ట్రాన్స్​జెండర్​తో కరీంనగర్‌ యువకుడి ప్రేమ వివాహం..సర్జరీ చేసుకుని మరీ !

by Bunty
Published: Last Updated on
Ads

జీవితంలోని ముఖ్యమైన కార్యాలలో పెళ్లి కూడా ఒకటి. జీవితంలో ఒకేసారి పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్లికి ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. కానీ చాలా మంది ఆ విషయాలను పట్టించుకోరు. అయితే పెద్దవాళ్ళు చెప్పే చాలా విషయాల వెనుకాల చాలా మ్యాటర్ ఉంటుంది. అలాగే పెళ్లికి ముందు కొన్ని విషయాలు ఎందుకు చేయకూడదు అని చెప్పడం వెనక కూడా కొన్ని నిజాలు ఉన్నాయి.

Advertisement

READ ALSO : అత్యంత ఖ‌రీదైన కారును కొన్న హైద‌రాబాదీ..అసలు ఈ నసీర్ ఖాన్ ఎవరో తెలుసా ?

నిజానికి పెళ్లి అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కలయిక. కానీ కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడు. జమ్మికుంటలో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ దివ్య ను జగిత్యాలకు చెందిన అర్షద్ అనే యువకుడు వివాహం చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలు అంగీకరించకపోయినా తాము ఒకరికొకరం తోడుగా కలిసి జీవించాలని నిర్ణయించుకుని సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.

Advertisement

జగిత్యాలకు చెందిన అర్షద్, వీణవంకకు చెందిన ట్రాన్స్ జెండర్ దివ్య ప్రేమలో పడ్డాడు. అర్షద్ కోసం దివ్య సర్జరీ చేయించుకున్నారు. తమ పెళ్లికి తల్లిదండ్రులు, బంధువులు సపోర్ట్ చేయకపోయినా అర్షద్ మాత్రం పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తనతో జీవితాంతం తోడుగా ఉంటానని అర్షద్ చెప్పడంతో తన ప్రేమను కాదనలేకపోయానని దివ్య చెప్పారు. ఇంట్లో సాంప్రదాయపద్ధంగా పెళ్లి చేసుకున్న తర్వాత దైవ దర్శనం కోసం ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ దర్శనానికి జంటగా వచ్చారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక ఈ పెళ్లి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

Advertisement

READ ALSO : తెలంగాణ యూట్యూబర్ ‘శ్రీ’ పెళ్లి.. సబ్‌స్క్రైబర్స్ నుంచి రూ.4 కోట్ల కట్నాలు!