Home » Mar 30th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 30th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై ఈ భేటీలో చ‌ర్చించ‌నున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై సమావేశంలో చ‌ర్చిస్తున్నారు.


భారత్‌లో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,016 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 40 శాతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది.

దేశరాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయ్యింది. నేడు ఢిల్లీ ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వ‌హిస్తోంది.

హైదరాబాద్ లో శ్రీ రాముడి శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతారామ్ బాగ్ ఆలయం నుండి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్రను కొన‌సాగించ‌నున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై 6 కిలో మీటర్ల మేర శోభ‌యాత్ర కొన‌సాగ‌నుంది.

ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌పాల్ సింగ్ బంగా ఖరారయ్యారు. నామినేషన్ల పర్వం ఇప్ప‌టికే ముగిసింది. ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో వరల్డ్‌ బ్యాంక్‌ చీఫ్ గా అజయ్‌ బంగా ఎన్నిక‌య్యారు.

తిరుమలలో 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 64,744 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జ‌ర‌గ‌నుంది. నేటి నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 5న సాయంత్రం పండు వెన్నెలలో కోదండ రాముని కళ్యాణం జ‌రుగుతోంది.

నేడు భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణం జ‌రుగుతోంది. క‌ళ్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజ‌రుకానున్నారు. కళ్యాణంలో చిన్న జీయర్ స్వామి సైతం పాల్గొన‌నున్నారు.

సైబర్ నేరాల హాట్ స్పాట్ గా చిత్తూరు ఉంద‌ని కేంద్రం గుర్తించింది. దేశంలో 36 ప్రాంతాలు సైబర్ నేరాలకు హాట్ స్పాట్ గా మారాయని అందులో ఏపీలోని చిత్తూరును సైబ‌ర్ నేరాల హాట్ స్పాట్ గా గుర్తించింది.

Visitors Are Also Reading