Telugu News » Blog » Mar 19th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 19th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ads

Advertisement

ఏపీకి భారీ వర్షసూచన ప్ర‌క‌టించారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.

నేడు భద్రాచలంలో నేడు పుష్కర నదీ జలాల తీర్థయాత్ర జ‌ర‌గ‌నుంది. దేశంలోని వివిధ నదుల నుంచి నదుల తీర్థాలను ఊరేగింపుగా రామాలయానికి తీసుకురానున్నారు.

నేడే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జ‌ర‌గ‌నుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ నెల‌కొంది. ఏసీఏ వీడీసీఏ స్టేడియంలోని పిచ్ పూర్తిగా కప్పివేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేడు జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.86 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూర‌నుంది. ఈ రోజు తిరువూరులో జరిగే కార్యక్రమంలో బటన్‌ నొక్కి రూ.698.68 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Advertisement

ఆదివారం కూడా అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 9 గంటలకు కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

నేడు ఉదయం 10 గంటలకు ఐదవ రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభ‌మయ్యాయి. ప్రశ్నోత్తరాలతో శాస‌న‌మండి స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. వార్షిక బడ్జెట్ పై ఆర్థిక‌మంత్ సమాధానం ఇవ్వ‌నున్నారు.

Advertisement

ఈ నెల 24న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై విచారణ జ‌ర‌గ‌నుంది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే ఈడీ విచారణకు హాజరయ్యేందుకు క‌విత సిద్దమవుతున్నారు. ఈ నెల 20న విచారణకు హాజరయ్యే అవకాశాలు తక్కువగా క‌నిపిస్తున్నాయి.

దక్షిణమద్య రైల్వే సహకారంతో IRCTC ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ ట్రైన్ ను న‌డుపుతున్నారు. తొమ్మిదిరోజుల పాటు పూరి , కోణార్క్ ,గయా ,వారణాసి , అయోధ్య,ప్రయాగ్ లోని పుణ్యక్షేత్రాలకు ఈ ట్రైన్ వెళ్ల‌నుంది.