Telugu News » Blog » Mar 14th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 14th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ads

ఏపీలో స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ అయ్యింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి. ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులు నిలిచిపోయాయి. డేటా సెంటర్‌లో అంతరాయం వల్ల డిజిటల్ సేవలకు బ్రేక్ పడింది.

Advertisement

హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేరుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హ* కేసులో నాలుగో సారి సీబీఐ ముందుకు అవినాష్‌రెడ్డి హాజ‌ర‌వుతున్నారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలో విచారణ జ‌ర‌గ‌నుంది.


పవన్ కోసం వారాహి వాహ‌నం సిద్ద‌మైంది. మంగళగిరి జనసేన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆటోనగర్‌లో వాహ‌నాన్ని పెట్టారు. వారాహిని చూసేందుకు ప‌వ‌న్ అభిమానులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు.

ఏపీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేశారు.

Advertisement

త‌మ‌ పార్టీలోని పెద్ద రెడ్లు కేసీఆర్‌కు అమ్ముడు పోయారంటూ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందన్నారు. తాను పీసీసీ చీఫ్‌ అయ్యాన‌ని…. తెలంగాణలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందన్నారు. 32 నుంచి 34 ఓటింగ్ శాతంలో ఉన్నామ‌ని రేవంత్ వ్యాఖ్యానించారు.

నేడు మచిలీపట్నంలో జనసేన వార్షిక ఆవిర్భావ సభను నిర్వ‌హిస్తున్నారు. బందరు శివారులో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. మద్యాహ్నం విజయవాడ నుంచి వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ బ‌య‌లుదేరారు.

తెలంగాణలో ఈనెల 15 వ తేదీ నుండి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే స్కూల్స్.. ఉదయం 8 గంటల నుండి 12.30 వరకు తరగతులు.. 12.30 కి మధ్యాహ్న భోజనం చేసేలా టైమ్ టేబుల్ రూపొందించారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వ‌హించనున్నారు.

corona omricon

corona omricon

తెలుగు రాష్ట్రాల‌లో హెచ్ 3 ఎన్ 2 వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ విష‌యాన్ని ఐసీఎంఆర్ వెల్ల‌డించింది. విదేశీయుల రాక మ‌రియు భారీ భ‌హిరంగ స‌భ‌ల వ‌ల్ల కేసులు పెరుగుతున్నాయని ఆరోపించింది.

నిన్న ఎమ్మెల్సీ క‌విత త‌న పుట్టిన రోజును జ‌రుపుకున్నారు. క‌విత కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌న పుట్టిన రోజును జ‌రుపుకున్నారు.