Telugu News » Blog » Mar 12th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 12th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ads

కాసేపట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి మూడు నెలల పాటు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయబోతున్నారు. ఎంపీ కోమటిరెడ్డి తో చర్చించనున్నారు.

Advertisement

వివేకా కేసులో సీబీఐ విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. భారీగా అనుచరులు రావడంతో జైలు వద్ద తోపులాట జరిగింది. ఓ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి కారు క్రింద పడిపోయారు. త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. సీబీఐ విచారణ సమయానికి వైఎస్ భాస్కర్ రెడ్డి వెంట ఆయన లాయర్ కొండారెడ్డి సైతం హాజరయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను చంద్రబాబు లేఖకు జత చేశారు.

దేశంలో CISF విశిష్ట భద్రతా సేవలు అందిస్తుందని అమిత్ షా అన్నారు. ప్రజల భద్రతతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిర్ పోర్ట్ , రైల్వే స్టేషన్లో ప్రముఖ మ్యూజియంలో CISF భద్రత దళాల సేవలు అందిస్తుందన్నారు. CISF రైజింగ్ పరేడ్ జరుపుకోవడం సంతోషంగా ఉందని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.

ముంబై విమానాశ్రయంలో రూ. 1.40 కోట్ల విలువ చేసే 3 కేజీల బంగారం ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని షూలో దాచి తరలించే యత్నం చేసిన ముగ్గురు విదేశీ ప్రయాణీకులను అరెస్ట్ చేశారు.

ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా చేపడుతున్నారు. ఉదయం తొమ్మిదిన్నరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. సజ్జల, ఇతర నేతలు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

Advertisement

ఉపరాష్ట్రపతి పదవిపై నటుడు రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదని అన్నారు. గొప్పనాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారన్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని అన్నారు.

హైదరాబాద్‌ శివారులోని ఫామ్‌హౌస్‌లు, లాడ్జిలు, హోటళ్లలో పోలీసుల సోదాలు నిర్వహించారు. అక్రమంగా మద్యాన్ని అనుమతిస్తున్న మేనేజర్లు అరెస్ట్ అయ్యారు. నిబంధనలు అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేశారు.

టీఎస్‌పీఎస్‌సీ పరీక్షా పేపర్లు హ్యాకింగ్..? కు గురయ్యాయి. దాంతో మూడు పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. రేపు, ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఈడీ విచారణ తరవాత ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. కవిత తో పాటు కేటీఆర్, హరీశ్ రావు సైతం ఉన్నారు.