Home » దాని కోసం పోరాడి చావ‌డానికైనా సిద్ద‌మే..మ‌రోసారి మ‌నోజ్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్..!

దాని కోసం పోరాడి చావ‌డానికైనా సిద్ద‌మే..మ‌రోసారి మ‌నోజ్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్..!

by AJAY
Ad

మంచు మ‌నోజ్ టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. మోహ‌న్ బాబు న‌టవార‌సుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మ‌నోజ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మ‌నోజ్ కు సప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతే కాకుండా మంచు ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన మ‌రో హీరో విష్ణు..మోహ‌న్ బాబు పెద్ద కుమారుడుగా విష్ణు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య అయ్యాడు. ఇక ఇద్ద‌రు అన్నా ద‌మ్ములు అప్ప‌ట్లో ఎంతో క్లోజ్ గా ఉండేవారు.

Advertisement

సినిమా ఫంక్ష‌న్ అయినా ఇత‌ర ఈవెంట్ లు అయినా క‌లిసిక‌ట్టుగా క‌నిపించేవారు. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో గానీ గ‌త రెండేళ్లుగా గొడ‌వ‌లు ఉన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా మనోజ్ పెళ్లితో ఆ గొడ‌వ‌లు కాస్తా తారాస్థాయికి చేరుకున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.మ‌రోవైపు మ‌నోజ్ పెళ్లిని అక్క ల‌క్ష్మీ ద‌గ్గ‌రుండి జ‌రిపించ‌గా మంచు విష్ణు అస‌లు వేడుక‌ల్లో క‌నిపించ‌లేదు. కేవ‌లం ఓ అతిధిలా వ‌చ్చి వెళ్లిపోయాడు.

Advertisement

అంతేకాకుండా మోహ‌న్ బాబు పుట్టిన రోజు సంధ‌ర్బంగా వీరు యూనివ‌ర్సిటీలో జ‌రిగిన ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సంధ‌ర్బంగా విష్ణు మోహ‌న్ బాబు ఒక ద‌గ్గ‌ర కూర్చోగా మ‌నోజ్ దూరంగా కూర్చుకున్నారు. ఇలా జ‌రిగిన వ‌రుస ఘ‌ట‌న లు ఇద్ద‌రి మ‌ధ్య దూరం ఉంద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పాయి. ఇలాంటి స‌మ‌యంలో మ‌నోజ్ ఏకంగా మంచు విష్ణు త‌న అసిస్టెంట్ పై దాడి చేసిన వీడియోను షేర్ చేసి దుమారం లేపారు.

Manchu Manoj

Manchu Manoj

ఇక మోహన్ బాబు విష‌యం తెలిసిన వెంట‌నే మ‌నోజ్ పై సీరియ‌స్ అయ్యాడు. స‌హ‌నం పాటించాలంటూ ఇద్ద‌రికీ సూచించారు. ఆ త‌ర‌వాత మ‌నోజ్ వీడియోను డిలీట్ చేశారు. అంతే కాకుండా ఇద్ద‌రికీ క్లాస్ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో పెట్టిన మ‌రో పోస్ట్ వైర‌ల్ అవుతోంది. కండ్ల ముందు జ‌రుగుతున్న త‌ప్పుల‌ను చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేయ‌డం కంటే నిజం కోసం పోరాడి చావ‌డానికైనా సిద్ద‌మే అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

also read : కృష్ణ చేయాల్సిన మూవీ..కానీ వెంకటేష్ ఎందుకు చేశాడు !

Visitors Are Also Reading