Telugu News » Blog » 4రోజుల్లోనే 3కోట్ల వ్యూవ్స్…చెల్లి స‌క్సెస్ పై మంగ్లీ ఎమోష‌నల్..!

4రోజుల్లోనే 3కోట్ల వ్యూవ్స్…చెల్లి స‌క్సెస్ పై మంగ్లీ ఎమోష‌నల్..!

by AJAY
Ads

టాలెంట్ తో పాటూ అదృష్టం ఉండాలేగానీ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోతుంటారు. ఇప్పుడు మంగ్లీ సోద‌రి ఇంద్రావ‌తి చౌహాన్ కూడా అలానే ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇంద్రావ‌తి పుష్ఫ సినిమా తెలుగులో ఊ అంటావా మామా ఊఊ అంటావా అనే పాట‌ను పాడి ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యింది.ఈ పాట‌లో ఇంద్రావ‌తి గొంతు ఒకెత్తు అయితే పాట చివ‌ర‌లో ఇంద్రావ‌తి ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్స్ ఒకెత్తు అనే చెప్పాలి. దాంతో పాట‌తో పాటూ ఇంద్రావ‌తి హావ‌భావాల వీడియో క్లిప్ నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. ఇక ఇంద్రావ‌తి పాట విడుద‌లైన వెంట‌నే ఈ అమ్మాయి ఎవ‌రా అని అంతా వెత‌క‌టం ప్రారంభించారు. మంగ్లీ సోద‌రి అని తెలియ‌డంతో అంతా అవాక్క‌య్యారు.

Advertisement

Advertisement

indhravathi chowhan

indhravathi chowhan

ఇక మంగ్లీ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రంలేదు. న్యూస్ ఛాన‌ల్ లో యాంక‌ర్ గా కెరీర్ మొద‌లు పెట్టిన మంగ్లీ అప్ప‌టికే శాస్త్రీయ సంగీతం పై ఉన్న ఉన్న ప‌ట్టుతో సంగీతం వైపు అడ‌గులు వేసింది, ప‌ల్లె పాట‌లు సినిమా పాటలు పాడుతూ ఫుల్ బిజీగా ఉంది. మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తూ మంగ్లీ ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలో త‌న చెల్లి ఓవ‌ర్ నైట్ స్టార్ గా మార‌డంపై తాజాగా మంగ్లీ స్పందించింది. నాలుగు రోజుల్లోనే మూడు కోట్ల వ్యూవ్స్ రాబ‌ట్టి ఊ అంటావా ఊఊ అంటావా పాట ఇంత పెద్ద స‌క్సెస్ అవ్వ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొంది.

కంగ్రాట్స్ ఇంద్రావ‌తి నీ డెబ్యూతోనే ఇంత‌టి స‌క్సెస్ ను అందుకున్నావంటూ చెల్లిపై ప్ర‌శంస‌లు కురిపించింది. అదేవిధంగా త‌న చెల్లికి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ సంగ‌త ద‌ర్శ‌కుడు డీఎస్పీల‌కు కృతజ్ఞ‌త‌లు చెప్పింది. ఇక మొదటి పాట‌తోనే ఇంత‌టి విజ‌యాన్ని అందుకున్న మంగ్లీ సోద‌రి ఇంద్రావ‌తి చౌహాన్ ముందు ముందు ఎలాంటి స‌క్సెస్ లు అందుకుంటుందో చూడాలి.