Telugu News » Blog » చిరంజీవి అయినా ఎవ‌రైనా మా నాన్న త‌ర‌వాతే…వైర‌ల్ అవుతున్న మంచు విష్ణు కామెంట్స్..!

చిరంజీవి అయినా ఎవ‌రైనా మా నాన్న త‌ర‌వాతే…వైర‌ల్ అవుతున్న మంచు విష్ణు కామెంట్స్..!

by AJAY
Ads

మంచు వార‌సుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు విష్ణు. స్టార్ ఫ్యామిలీ నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా మంచు విష్ణు స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయారు. విష్ణు కెరీర్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ వ‌రుస హిట్లు అందుకోక‌పోవ‌డంతో స్టార్ స్టేట‌స్ అందుకోలేక‌పోయారు. ఇక మంచు విష్ణు మా ఎల‌క్ష‌న్స్ లో పోటీ చేసి హాట్ టాపిక్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్ ప్యానల్ కు పోటీగా నిల‌బ‌డిన మంచు విష్ణు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మా అధ్య‌క్షుడిగా ఎదిగారు.

Ads

ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో రెచ్చిపోవ‌డంతో మంచు విష్ణు పై ట్రోల్స్ వ‌చ్చాయి. మా ఎన్నిక‌ల స‌మ‌యంలో యూట్యాబ్, ఇన్స్టా ఇలా సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం ఏదైనా అందులో మంచు విష్ణు పై పోస్ట్ లు వీడియోలు మాత్రం కంప‌ల్స‌రీ అయ్యాయి. అంతే కాకుండా మంచు విష్ణు మా ఎన్నిక‌ల స‌మ‌యంలో కొన్ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దాంతో మంచు విష్ణు చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఓ ఇంట‌ర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ….నేను మా ఎల‌క్ష‌న్స్ లో పోటీ చేయాల‌ని అనుకోలేదు.

Ads

సినిమా ఇండ‌స్ట్రీ నుండి కొంత‌మంది పెద్ద‌లు వ‌చ్చి న‌న్ను సంప్ర‌దించారు. నేను నాన్న గారిని సంప్ర‌దిస్తే ఇప్పుడు ఎందుకు అన్నారు. ఆ తర‌వాత నీ ఇష్టం చేస్తే చేయు అని చెప్పార‌ని తెలిపారు. అందుకే మా ఎన్నిక‌ల్లో పోటీకి దిగాను. ఒక‌వేళ మా నాన్న వ‌ద్ద‌ని చెప్పితే నాకు పోటీ చేయాల‌ని ఉన్నా ప‌క్క‌కు త‌ప్పుకునేవాన్ని అంతే కానీ చిరంజీవి కాదు ఆయ‌న వెన‌క ఉన్న దేవుడు చెప్పినా త‌గ్గ‌ను.

Ad

నాకు అంద‌రికంటే ముందు మా నాన్నే ఆయ‌న చెప్పిన మాట‌ను ఖ‌చ్చితంగా వింటాను. కొంత‌మంది మంచు విష్ణు రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్నాడ‌ని అంటున్నారు. రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌ని ఉంటే ఎప్పుడో వెళ్లేవాడిని…మా నాన్న రాజ్య‌స‌భ మాజీ మెంబ‌ర్ మా బావ ప్ర‌స్తుతం సీఎం….కేటీఆర్ తో నాకు ద‌గ్గ‌ర సంబంధాలు ఉన్నాయి. అంత బ్యాగ్రౌండ్ పెట్టుకుని మా ఎల‌క్ష‌న్స్ ను నేను రాజ‌కీయ అరంగేట్రానికి వాడుకుంటాను అనుకోవ‌డం మూర్ఖ‌త్వం అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం ఈ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.