Telugu News » మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్…!

మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్…!

by AJAY MADDIBOINA

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురికి కరోనా రాగా వారు కోలుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి ప్రముఖులను కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంటుంది. అయితే తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరుణ పాజిటివ్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మనోజ్ వెల్లడించారు.

Ads
Manchu Manoj

Manchu Manoj

గత వారం లో తనను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మనోజ్ రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని తన ఆరోగ్యం బాగానే ఉందని మనోజ్ వెల్లడించారు. మనోజ్ కు కరోనా రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు.


You may also like