Home » విష్ణు మ‌నోజ్ ల గొడ‌వపై మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

విష్ణు మ‌నోజ్ ల గొడ‌వపై మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

నిన్న మంచు బ్ర‌ద‌ర్స్ విష్ణు మ‌రియు మ‌నోజ్ ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మనోజ్ అసిస్టెంట్ సార‌ధి పై మంచు విష్ణు దాడి చేశాడు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియోను మ‌నోజ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇలా వచ్చి త‌న బంధువులు మ‌రియు సన్నిహితుల పై దాడి చేస్తూ ఉంటాడ‌ని ఆరోపించాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అయ్యింది.

also read : కృష్ణవంశీ గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

Advertisement

మీడియాలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల వ్య‌వ‌హారం మారుమోగిపోయింది. దాంతో మోహ‌న్ బాబు రంగంలోకి దిగి కొడుకుకు పంచాయితీ చెప్పారు. ఇదిలా ఉంటే ఈ విష‌యం పై తాజాగా మంచు ల‌క్ష్మి స్పందించారు. దీనిని ఇంట్లో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌గా చూడాల‌ని దీనిని ర‌చ్చ చేయ‌వ‌ద్ద‌ని కోరింది.

Advertisement

అంతే కాకుండా ఇద్దరి మ‌ధ్య వివాదం త్వ‌ర‌గానే ప‌రిష్కారం అవుతుంద‌ని విష‌యం పూర్తిగా తెలియ‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్టు వార్త‌లు రాయ‌వ‌ద్ద‌ని చెప్పింది. ఇదిలా ఉంటే రెండేళ్ల నుండి మ‌నోజ్ విష్ణు మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్టు టాలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాకుండా మ‌నోజ్ పెళ్లి స‌మ‌యంలో వివాదం మ‌రింత ముదిరింద‌ని స‌మాచారం.

మ‌రోవైపు మ‌నోజ్ మౌనిక ల పెళ్లిలో మంచు విష్ణు అంటీ ముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు ఉన్నాయ‌ని జ‌నాల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు విష్ణు మ‌నోజ్ అసిస్టెంట్ పై దాడి చేయ‌డంతో ఆ గొడ‌వ‌లు తారా స్థాయికి చేరిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మ‌నోజ్ విష్ణు పై కేసు పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నారని కూడా టాక్ వినిపించింది. అయితే మ‌నోజ్ మాత్రం పోలీస్ స్టేష‌న్ లో ఎలాంటి ఫిర్యాదు చేయ‌లేదు.

also read :కృష్ణవంశీ గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading