మంచుమోహన్ బాబు ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా రానించారు. సీనియర్ హీరోలతో పాటూ మోహన్ బాబు చిరంజీవితోనూ పోటీపడ్డారు. అంతే కాకుండా అత్యధిక కలెక్షన్లను రాబట్టి కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ లో ఎదిగారు. ఇక మంచు మోహన్ బాబు నట వారసులుగా మంచు లక్ష్మి, మనోజ్, విష్ణు లు సైతం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. లక్ష్మి సినిమాలతో పాటూ టీవీ షోలు మరియు నిర్మాతగా కూడా రానిస్తున్నారు.
Advertisement
అంతే కాకుండా మంచు విష్ణు ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు మా ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడుగా విధులు నిర్వహిస్తున్నారు. మనోజ్ పర్సనల్ కారణాల వల్ల చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీలో వారసులు మధ్య విభేదాలు మొదలయ్యాయి అంటూ వార్తలు గుప్పుమన్నాయి…అందుకే వీరంతా దూరంగా ఉంటున్నారని కూడా వార్తలు వచ్చాయి.
Advertisement
కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్ లు చేసింది. మేం అందరం ఎప్పటికీ కలిసే ఉంటామని సామాధానం ఇచ్చింది. అంతే కాకుండా మేం కలిసి ఉండటం దూరంగా ఉండటం మా పర్సనల్ విషయం అంటూ ఫైర్ అయ్యింది. మంచు విష్ణు వ్యాపారలతో బిజీగా ఉన్నాడని చెప్పింది. అందుకే విష్ణు పెద్దగా బయటకు రాడని తెలిపింది.
అంతే కాకుండా మనోజ్ తాను అప్పుడప్పుడూ కలుస్తామని ఎంజాయ్ చేస్తామని చెప్పింది. విష్ణు దూరంగా ఉండడం వల్లనే అలాంటి వార్తలు వచ్చాయని….కానీ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. మరోవైపు మనోజ్ భూమా మౌనికారెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఈ విషయం పై స్పందించిన మంచు లక్ష్మి ఎవడి దూల వాడిది అంటూ కామెంట్స్ చేసింది.