విరాట్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం మనసానమః తన రికార్డుల పరంపర కొనసాగిస్తుంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులతో సహా ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే ఇంటర్‌నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ షార్ట్ ఫిలింగా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా మనసామనమః జాతీయ, అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెలుచుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నది.
గిన్నిస్ రికార్డ్స్‌లో ఎక్కిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. “మనసానమః” చిత్రం లో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్‌రెడ్డి తన మొదటి ప్రయత్నంగా మనసానమః షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అదేవిధంగా ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులపై క్వాలిపై అయింది.
Advertisement
Advertisement
తాజాగా గిన్నీస్ బుక్‌లోనూ చోటు దక్కించుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం మొత్తంగా తొలి ప్రయత్నంలోనే విరాజ్ అశ్విన్ నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోవడం చూసి సినీ ప్రముఖులు ఈ చిత్ర దర్శక, నిర్మాతలను ప్రశంసిస్తున్నారు. విరాజ్ అశ్విన్ నటించిన ఈ షార్ట్ ఫిలిం మనసానమః పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులతో సహా ఆస్కార్ క్వాలిఫైకు వెల్లింది. మొత్తానికి ఒక తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్లడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :
ఇంతవరకు మీరు ఎప్పుడూ చూడని ఉదయ్ కిరణ్ ఫోటోస్..!!