దొంగలంటే రెక్కీ నిర్వహించడం, చడీ చప్పుడు కాకుండా కన్నాలేయడం, దొంగిలించిన సొమ్మును మూడవ కంటికి కనిపించకుండా అమ్మేయడం చేస్తుంటారు కానీ గుజరాత్ కు చెందిన ఈ దొంగ మాత్రం దొంగతనం చేయడానికి ముందు కఠినమైన డైట్ ను పాటించాడు….. 3 నెలల్లో 10 కేజీల బరువు తగ్గి తన డెడికేషన్ చూపించాడు.
Advertisement
Advertisement
గుజరాత్ లోని బసంత్ బహార్ సొసైటీ చౌహన్ అనే ఉదయపూర్‌కు చెందిన సహాయకుడిగా పనిచేస్తాడు. చాలా రోజులుగా మోహిత్ మరాడియా ఇంట్లోని వస్తువులను కాజేయ్యాలని ప్లాన్ చేసిన చౌహన్ అనుకున్నదనే తడవుగా 3 నెలలు డైటింగ్ చేసి 10 కేజీల బరువు తగ్గాడు. ఎందుకంటే ఆ మరాడియా ఇంట్లోకి వెళ్లాలంటే అక్కడి గాజు కిటికీ గుండా లోపలికి వెళ్లాలి….అతడు అప్పుడున్న బరువుతో ఇది సాధ్యం అయ్యేపని కాదని గ్రహించిన చౌహన్ 10 కేజీలు తగ్గి ఆ కిటికీ గుండా ఇంట్లోకి జొరబడి దాదాపు 37 లక్షలు కాజేశాడు.