ఐపీఎల్ సీజన్ 17 వేలం పూర్తి అయింది. ఈ వేలంలో దేశ విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం ఐపీఎల్ వేలం జరిగింది. ఈసారి ఐపీఎల్ వేలానికి ఓ ప్రత్యేకత ఉంది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఐపిఎల్ వేలం ప్రక్రియను ఓ మహిళ నిర్వహించింది. ఈసారి వేలాన్ని మల్లికా సాగర్ అనే మహిళ నిర్వహించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వేలం నిర్వహించిన మహిళగా మల్లికా నిలిచింది. ఇంతకీ మల్లికా సాగర్ అద్వానీ ఎవరు అని నెట్టింట్లో క్రికెట్ అభిమానులు తెగ వెతుకుతున్నారు.
48 ఏళ్ల మల్లికా సాగర్ ముంబైకు చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్. ప్రస్తుతం ఆమె మోడ్రన్ అండ్ కాన్ టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. వేలం నిర్వహించడంలో మల్లికకు అనుభవం ఉంది. 20 ఏళ్లుగా వేలం నిర్వహకురాలుగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఆమె తన కెరీర్లో 2,500 వేర్వేరు వేలం కార్యక్రమాలను నిర్వహించారు. 2021లో ప్రో కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ కు సంబంధించిన వేలాన్ని కూడా మల్లికా నిర్వహించింది.
Advertisement
డిసెంబర్ 9న ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ వేలంలో కూడా మల్లికా ఆక్షనర్ గా వ్యవహరించింది. ఇప్పుడు ఐపీఎల్ వేలాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి 2018 వరకు రీఛర్డ్ అక్షనర్ గా కొనసాగాడు. ఆ తర్వాత 2018 నుంచి హెడ్ మిట్స్ వేలాన్ని నిర్వహించారు. 2022 మధ్యలో ఆయన అనారోగ్యానికి గురి కావడంతో చారు శర్మ మిగతా వేలాన్ని కొనసాగించారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ వేలాన్ని మల్లికా సాగర్ అద్భుతంగా జరిపించారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.