Telugu News » Blog » Malikappuram Movie Review : మాలికాపురం మూవీ ఎలా ఉందో తెలుసా ?

Malikappuram Movie Review : మాలికాపురం మూవీ ఎలా ఉందో తెలుసా ?

by Anji
Ads

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇతర భాషల్లో సూపర్ హిట్ గా నిలిచినటువంటి సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. గతంలో కాంతార వంటి డివోషనల్ కంటెంట్ సినిమాను తీసుకొచ్చి టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తాజాగా మాలికాపురం అనే చిత్రాన్ని తెలుగులో విడుదల చేసింది. మలయాలంలో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడంతో భారీ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సమంత యశోద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముకుందన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి కథ కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తి నెలకొంది. 

Advertisement

నటీనటులు :

ఉన్నీ ముకుందన్, ఆల్పీ పంజికరన్, దేవనంద , శ్రీపత్, సైజు కురుప్, రమేష్ పిషారోడి, మనోజ్ కే జయన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించగా.. నీతా పింటోగా నిర్మాతగా వ్యవహరించారు. 

Also Read : దర్శకేంద్రుడికి తీరని 3 కోరికలు..!

కథ :

కేరళలోని ఓ చిన్న గ్రామంలో ఈ చిత్రం యొక్క కథ ప్రారంభమవుతుంది. షన్ను అనే ఎనిమిదేళ్ల చిన్నారికి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. అయ్యప్ప స్వామి దేవుడు కాదు.. తన స్నేహితుడు ఓ సూపర్ హీరో అనేంతగా ఆమె భావిస్తుంటుంది. చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి గురించి నాన్నమ్మ చెప్పే కథలు వింటూ.. అయ్యప్ప స్వామిని చూడాలని భావిస్తుంటుంది. ఆమె తండ్రి ఆమెను శబరిమలకు తీసుకెళ్తానని చెబుతుంటాడు. కానీ ఎప్పుడూ వాయిదా వేస్తుంటాడు. అయ్యప్ప మాల ధరించి కొద్ది రోజుల్లో శబరిమల వెళ్దామనుకుని సిద్ధమైన సమయానికి అప్పుల వారి చేతిలో అవమానం కలగడంతో షన్ను తండ్రి అకస్మాత్తుగా మరణిస్తాడు. కుటుంబం అయోమయంలో ఉన్న పరిస్థితిలోనే తమ పక్కనే కలిసి నివసించే మరో బాబుని తీసుకొని ఇంట్లో చెప్పకుండా అయ్యప్ప దర్శనానికి వెళ్లాలని బయలుదేరుతుంది షన్ను. ఈ నేపథ్యంలోనే చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకునే ముఠాలోని సభ్యుడు షన్నుని తీసుకెళ్లి అమ్మడానికి ప్రయత్నంగా.. ఓ వ్యక్తి కాపాడుతాడు. అతనే అయ్యప్ప స్వామి అని భావిస్తుంటుంది. షన్నుని కాపాడింది అయ్యప్ప స్వామి నా..? లేక ఆమెను కాపాడిన వ్యక్తి ఎవరో తెలియాలంటే ఈ చిత్రం వీక్షించాల్సిందే. 

Advertisement

Also Read :  Sr:ఎన్టీఆర్ మూవీలో కూడా మేకప్ లేకుండా నటించిన స్టార్ హీరోయిన్..!!

విశ్లేషణ :

Unni Mukundan's Malikappuram gets a release date- Cinema express

పిల్లలు, భక్తి దేవుడిని దర్శించుకోవడం పిల్లలు ఇంటిని వదిలి వచ్చేయడం వంటి కాన్సెప్ట్ వినగానే మనకు దేవుళ్లు అనే సినిమా గుర్తుకొస్తుంది. ఇదే గతంలో చాలా సినిమాలు వచ్చాయి. తొలిసారి అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వచ్చే బాలికలను మాలికాపురం అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ చిత్ర కథ మొత్తం షన్ను  చుట్టూనే తిరుగుతుంది. అందుకే మాలికాపురం అనే టైటిల్ నిర్ణయించారు. ముఖ్యంగా షన్ను మాలికాపురంగా మారి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం కోసం మాల ధరించడంతో కథ చాలా ఎమోషనల్ గా ప్రారంభమవుతుంది. తన తండ్రి ఊహించని విధంగా చనిపోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోతుంది. అయ్యప్ప స్వామి మీద ఉన్న ప్రేమతో ఎలాగైనా సరే దర్శించుకోవాలనే ఉద్దేశంతో తనకు వరసకు సోదరుడు అయ్యే బుజ్జిని తీసుకొని శబరిమలకి బయలుదేరి వెళ్లడం ఆసక్తికరంగా ఉంటుంది. వారు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేసే ముఠాలోని వ్యక్తి వీరిని వెంటాడటం.. అయ్యప్ప పేరు గల వ్యక్తి వచ్చి అండగా నిలవడంతో కథ ఆద్యంత ఆసక్తిగా కొనసాగుతుంది. చివరికీ ఈ పిల్లలు అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇంటికి ఎలా చేరుకున్నారనేది ఈ చిత్రం. ఫైనల్ చెప్పాలంటే.. మాలికాపురం అనే చిత్రం ఓ డివోషనల్ జర్నీ అనే చెప్పవచ్చు. చిన్న పిల్లలు, అయ్యప్ప భక్తులు, దైవ భక్తి ఉన్నటువంటి వారు తప్పకుండా చూడాల్సిన మూవీ. ఇది చిత్రం ట్రావెల్ వ్లాగ్ లా ఉంటుంది. కానీ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. 

రేటింగ్ :

2.75 /5.

Advertisement

Also Read :  Sindhooram Movie Review : సిందూరంలో ఎర్ర జెండాపై మాటల తూటాలు ఎలా ఉన్నాయంటే.?