Home » హీరో వెంకటేష్ విగ్గు వాడతారా.. ఆయన వాడుతున్న విగ్గు ఖరీదెంతంటే ?

హీరో వెంకటేష్ విగ్గు వాడతారా.. ఆయన వాడుతున్న విగ్గు ఖరీదెంతంటే ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ 61 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకీకి పలువురు సెలబ్రిటీలు బర్త్డే విషెస్ చెబుతున్నారు. వెంకీ తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎందరో హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసారు.


ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్న ఆరోగ్యం విషయంలో మాత్రం స్టైల్ ని బాగా ఫాలో అవుతాడు. ఇక తన హెయిర్ స్టైల్ విషయానికి వస్తే చాలామందికి వెంకీ మామ విగ్గు పెట్టుకుంటాడు అనే విషయమే తెలియదు. అయితే ఈ రహస్యాలను తాజాగా, వెంకీ మామ మేకప్ మాన్ రాఘవ చెప్పాడు. వెంకీది ఒరిజినల్ జుట్టు అనే అందరూ అనుకున్నప్పటికీ అది విగ్గు అంటూ మేకప్ మాన్ రాఘవ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. వెంకటేష్ తో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న రాఘవ, వెంకీ మామ విగ్గులను విదేశాల నుండి తెప్పిస్తామంటూ తెలిపారు.

Advertisement

Advertisement

ఏ సినిమాకు ఎలాంటి విగ్గు ఉండాలో డైరెక్టర్ తో చర్చించి ఆపైన హెయిర్ స్టైల్ డిజైన్ చేసి తెప్పిస్తామంటూ చెప్పారు. సురేష్ బాబు గారికి ఉన్నట్లుగా వెంకీ జుట్టు పల్చబడిందని, అది సినిమాల్లో పనికిరాదు కాబట్టి విగ్గు పెడతామని, ఇక రియల్ గా కూడా విగ్ పెట్టుకుంటారని, అయితే ఆయనకు అది సహజంగా జుట్టులా కనిపిస్తుంది అంటూ తెలిపారు. విగ్గులు విదేశాల నుంచి తెప్పిస్తామని ఒక్కో విగ్గుకు 60 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని మేకప్ మాన్ రాఘవ అన్నారు.

read also : Virat To Pant : 2022లో అత్యధికంగా జీతాలు తీసుకుంటున్న టాప్ 10 ఇండియన్ క్రికెటర్లు

Visitors Are Also Reading