Home » “బ్రహ్మోత్సవం” మూవీ ప్లాప్ నుండి తప్పించుకున్న స్టార్ హీరో… ఆ హీరో చేసుంటే ఇక అంతే..!

“బ్రహ్మోత్సవం” మూవీ ప్లాప్ నుండి తప్పించుకున్న స్టార్ హీరో… ఆ హీరో చేసుంటే ఇక అంతే..!

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటి వరకు తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే కొన్ని డిజాస్టర్ మూవీలలో కూడా హీరోగా నటించాడు. అలా మహేష్ కెరియర్లో డిజాస్టర్ మూవీలో లిస్టులో మొదటి వరుసలో ఉండే సినిమా బ్రహ్మోత్సవం.

Advertisement

ఈ సినిమాకు కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలతో అద్భుతమైన ఫామ్ లో ఉన్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా… సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో రావు రమేష్, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీమంతుడు మూవీ తర్వాత మహేష్ నటించిన మూవీ కావడంతో ఈ మూవీపై మహేష్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Advertisement

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరజయాన్ని అందుకుంది. ఈ సినిమా కనీసం మహేష్ అభిమానులను మినిమం రేంజ్ లో కూడా అలరించలేకపోయింది. ఇలా మహేష్ కెరియర్లో ఓ పీడ కలలా మిగిలిపోయిన ఈ మూవీని మొదటగా ఈ మూవీ దర్శకుడు మహేష్ తో కాకుండా మరో టాలీవుడ్ స్టార్ హీరోతో చేయాలి అనుకున్నాడట కాకపోతే ఆ హీరో ఈ మూవీ ని రిజెక్ట్ చేయడంతో మహేష్ తో ఈ మూవీ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ కథను మొదట జూనియర్ ఎన్టీఆర్ కు ఈ మూవీ దర్శకుడు వినిపించాడట. ఈ మూవీ కథ ఎన్టీఆర్ కు అస్సలు నచ్చకపోవడం… అలాగే ఆ సమయంలో ఇతర మూవీలతో ఎన్టీఆర్ బిజీగా ఉండడం వల్ల ఎలాంటి మొహమాటం లేకుండా ఈ మూవీలో నటించడానికి ఎన్టీఆర్ నో చెప్పినట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading