Home » “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో వెంకటేష్, మహేష్ బాబుల పేర్లు చిన్నోడా పెద్దోడా కాదు…అసలు పేర్లు ఇవే…!

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో వెంకటేష్, మహేష్ బాబుల పేర్లు చిన్నోడా పెద్దోడా కాదు…అసలు పేర్లు ఇవే…!

by AJAY
Ad

మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో వెంకటేష్ కూడా హీరోగా నటించారు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ మల్టీ స్టారర్ సినిమాలో వెంకటేష్ అన్నగా నటించగా మహేష్ బాబు తమ్ముడిగా నటించారు. ఇక వెంకటేష్ కు జోడిగా అంజలి హీరోయిన్ గా నటించగా మహేష్ బాబుకి జోడిగా సమంత హీరోయిన్ గా నటించింది.

 

Advertisement

అంతేకాకుండా సినిమాలో ప్రకాష్ రాజ్ మహేష్ బాబు వెంకటేష్ లకు తండ్రి పాత్రలో నటించాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని ఎమోషన్స్ మరియు కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య రిలేషన్ షిప్ ఏ విధంగా ఉంటుంది…. అదేవిధంగా తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో చక్కగా చూపించగలిగారు.

 

Advertisement

దాంతో ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చినా ప్రేక్షకులు మిస్ కాకుండా చూస్తుంటారు. సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రతో పాటు రావు రమేష్ క్యారెక్టర్ కూడా హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబులను అందరూ చిన్నోడు పెద్దోడు అని పిలుస్తుంటారు. తల్లిదండ్రులే కాకుండా మహేష్ బాబుని అంజలి సమంతలు కూడా చిన్నోడా పెద్దోడా అని పిలవడం కనిపిస్తుంది.

 

దాంతో అసలు సినిమాలో వెంకటేష్ మహేష్ బాబు పేర్లు ఏంటన్నది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే తాజాగా వీరిద్దరి పేర్లు సినిమాలో ఇవేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా డిస్క్రిప్షన్ లో మహేష్ బాబు పేరు సీతారామరాజు అని అదేవిధంగా వెంకటేష్ పేరు మల్లికార్జున రావు అని కనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ALSO read :“పెళ్లి సందడి” సినిమా హీరోయిన్ రవళి గుర్తుందా…? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

Visitors Are Also Reading