Home » ఆ దర్శకుడిని మహేష్ కావాలనే పక్కన పెడుతున్నాడా…?

ఆ దర్శకుడిని మహేష్ కావాలనే పక్కన పెడుతున్నాడా…?

by Azhar
Ad

తెలుగులోని సూపర్ స్టార్ హీరోలలో నిజంగా సూపర్ స్టార్ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు మహేష్ బాబు. టాలీవుడ్ లోకి సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ ఆ తర్వాత తా నటనతో ఆ విషయాన్ని మరిచిపోయేలా చేసాడు. వరుస సినిమాలు హిట్స్ కొట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే మహేష్ చేసే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకోగా… ఆయన చేసే సేవ కార్యక్రమాల వల్ల కూడా పేరు బాగానే వచ్చింది. ఇక ఇప్పటికి తెలుగులో చాలా మంది డైరెక్టర్లతో పనిచేసిన మహేష్ బాబు ఓ డైరెక్టర్ ను కావాలనే పక్కన పెడుతున్నాడా అనే అనుమానాలను వస్తున్నాయి.

Advertisement

అయితే ఆయన మన తెలుగు డైరెక్టర్ కాదు. తమిళ్ డైరెక్టర్. అయిన కూడా ఆయనకు తెలుగులో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆయన కొన్ని సినిమాలు తెలుగులో తీయగా.. తమిళ్ లో తీసిన ప్రతి సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తారు. ఆయన ఎవరో కాదు.. స్టార్ డైరెక్టర్ గౌతం మీనన్. ఈయన తీసే సినిమాలు చాలా సింపుల్ గా కనిపించిన పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాయి. ఇక ఈయన సినిమాన తీసే విధానానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈయననే మహేష్ బాబు దూరం పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

గతంలో గౌతం మీనన్ సూపర్ హిట్ సినిమాలు ఇచ్చి సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఈయనతో సినిమాలు చేయాలనీ మహేష్ బాబు అనుకున్నాడట. కానీ కుదరలేదు. ఇక ఆ తరవాత అంటే గత 10 ఏళ్ళ నుంచి మహేష్ తో సినిమా చేయాలనీ గౌతం మీనన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కారణాలు ఏంటి అనేవి తెలియదు కానీ.. వీరి కాంబినేషన్ లో సినిమా మాత్రం రావడం లేదు. ఇక ప్రస్తుతం సినిమాలు తీయడం తగ్గినచిన గౌతం మీనన్.. సినిమాలో నటించడం ఎక్కువగా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

పంత్ లా మారిపోయిన ధోని…!

నేను చెప్పను అని ఇంగ్లిష్ మీడియాకు చెప్పిన భువనేశ్వర్…!

Visitors Are Also Reading