Home » Qలో నిలబడి మూవీ టికెట్లు కొన్న మహేష్ బాబు.. ఆ అమ్మాయిని అలా చేశాడేంటి..?

Qలో నిలబడి మూవీ టికెట్లు కొన్న మహేష్ బాబు.. ఆ అమ్మాయిని అలా చేశాడేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సర్కార్ వారి పాట సినిమా సక్సెస్ అందుకున్న మహేష్ బాబు కెరియర్ లో దూసుకుపోతున్నారు. ఓవైపు నిర్మాతగా మరో వైపు నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఆయన నిర్మిస్తున్న తాజా సినిమా మేజర్.26/11 ముంబై దాడులలో మరణం పొందినటువంటి యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించారు. అయితే ఈ మూవీ మూడవ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

అయితే ఈ మూవీని పది రోజుల ముందు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాదు లోని ఏఎంబి సహా తొమ్మిది ప్రధాన నగరాలలో మేజర్ సినిమా ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24వ తేదీ నుండే రోజుకు ఒక సెంటర్లో మేజర్ మూవీ ప్రివ్యూ లను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంలోనే మూవీ ప్రమోషన్ చాలా డిఫరెంట్ గా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా టికెట్ల కోసం మహేష్ బాబు కూడా క్యూలో నిల్చున్నారు. మూవీ ప్రచారంలో భాగంగా ఆ విధంగా చేశారు. ఈ తరుణంలోనే ఒక థియేటర్ ముందు అప్పటికే క్యూలైన్లో నిల్చున్న నిహారిక ముందుకు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆమెకు చిరాకు తెప్పిస్తారు. ఈ క్రమంలోనే అడవిశేషు కూడా వస్తారు. దీంతో వారిద్దరి మధ్య కొంత వాగ్వాదం జరుగుతుంది.

Advertisement

Advertisement

ఈ సమయంలోనే మహేష్బాబు వచ్చి ఆ లైన్లో నిలబడతారు. దీంతో నిహారిక ఆయనను చూసి ఆశ్చర్యపోయి, మా స్నేహితులను కూడా పిలవచ్చా అని అడుగుతుంది. మహేష్ బాబు కూడా ఓకే చెబుతారు. దీంతో ఆ లైన్ ఇంకా పెరుగుతుంది. ఇక నిహారిక చేసేది ఏమీ లేక మహేష్ బాబు ఫోన్ నెంబర్ అడిగే లోపు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో అక్కడ జరిగిన సన్నివేశం వీడియోను వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దాన్ని చూసిన మహేష్బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

also read;

మురళీమోహన్: NTR ను నమ్మించి మోసం చేశారు.. ఆరోజు రాత్రి అలా జరగడంతో నా కడుపు మండిపోయింది..?

మిర్చి హీరోయిన్‌ను చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.. సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్..!

 

 

Visitors Are Also Reading