Home » మహేష్ బాబు SSMB విడుదల ఎప్పుడో తెలుసా ?

మహేష్ బాబు SSMB విడుదల ఎప్పుడో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవలే ప్రారంభం అయింది. తాజా షెడ్యూల్ లో హీరోయిన్స్ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అయితే ఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 11, 2023లో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

Also Read :  రాజకీయాల్లోకి జూ. ఎన్టీఆర్… ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Advertisement

అనుకున్న సమయానికి ఈ సినిమా రావడం లేదని.. షూటింగ్ పూర్తి కానీ నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారట. ఇక అదే సమయంలో మెగాస్టార్ బోళాశంకర్ చిత్రం విడుదలవుతుందని ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేసింది. మహేష్ బాబు సినిమా మాత్రం మరోసారి సంక్రాంతి బరిలో దిగనుంది. ఇప్పటికే మహేష్ బాబు సంక్రాంతికి వచ్చిన సినిమాలు దాదాపుగా సూపర్ హిట్ సంపాదించాయి. తాజాగా జనవరి 13న విడుదలవుతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. రామ్ చరణ్ RC15 కూడా సంక్రాంతికి వస్తున్నట్టు ప్రకటించారు. 

Advertisement

Also Read  :  చిరంజీవికి ముచ్చమటలు పట్టించిన ‘వెంకటేష్’ సినిమా! దెబ్బకి రికార్డ్స్ బద్దలు!

Manam News

ఈసారి పోటీ గట్టిగానే ఉండనున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాకి అమ్మకథ, అమరావతికి అటు ఇటు, అమ్మఒడి, గుంటూరు కారం, ఆరంభం వంటి సినిమా పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో క్రేజి సిస్టర్ పాత్ర ఉందట. ఈ సినిమా కథ మొత్తం ఓ క్యారెక్టర్ చుట్టూ సాగుతుందని టాక్ వినిపిస్తుంది. సిస్టర్ పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం హీరోయిన్ సాయిపల్లవిని తీసుకోవాలని భావిస్తున్నారట. మహేష్ బాబు చెల్లిగా ఎవరు నటిస్తారో.. ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తుందా లేదో తెలియాలంటే మాత్రం అప్పటివరకు వేచి ఉండాల్సిందే. 

Also Read :   Brahmamgari Kalagnanam : 2023 నుంచి 2060 వరకు జరిగేది ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading